NOTA: నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఏం చేయాలి.. ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

ఎన్నికల నియామవళిలో నోటాకు అభ్యర్థితో సమానమైన హక్కును కల్పించిన విషయం తెలిసిందే. అయితే నోటాకు సంబంధించిన రూల్స్ విషయంలో స్పష్టమైన నిబంధనలు ఉండాలని సుప్రీంకోర్టు ఈసీకి నోటీసులు జారీ చేసింది.

  • Written By:
  • Updated On - April 26, 2024 / 01:37 PM IST

NOTA: దేశంలో లోక్‌సభ ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. మొదటి దశ ఎన్నికలు ఏప్రిల్ 19న జరిగాయి. ఈ రోజు ఏప్రిల్ 26న రెండో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు(Supreme Court) కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి నోటీసులు జారీ చేసింది. నోటా విషయంలో ఇంకా కొన్ని గందరగోళాలు ఉన్నట్లు వాటిని పరిష్కరించాలని అందులో పేర్కొంది. ఈవీఎం మిషన్లు వచ్చిన తరువాత నోటా అనే అదనపు బటన్ తీసుకొచ్చారు. ఇక 2013 నుంచి దీన్ని ఓటర్లకు పరిచయం చేశారు. ఎన్నికల్లో పోటీచేసే వ్యక్తులు నచ్చకపోతే ఈ నోటా బటన్‌నుకు ఓటు వేయవచ్చు. అయితే దాన్ని అదనపు ఓటుగానే భావించేవారు. నోటా అంటే ఎవరు కాదు అనేది అర్థం. ఆ తరువాత అందులో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి.

చదవండి:EVM: ఈవీఎంలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

2018లో తొలిసారిగా నోటాకు అభ్యర్థితో సమానమైన హోదా కల్పించారు. హర్యానాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల కంటే నాటాకే ఎక్కువ ఓట్లు నమోదు అయ్యాయి. దాంతో తొలిసారి మళ్లీ ఎన్నికలు నిర్వహించారు. ఆ తరువాత స్పష్టమైన మెజారిటీ ఉన్న అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. లేదంటే నోటా తరువాత రెండో స్థానంలో ఓట్లు వచ్చిన వ్యక్తిని విజేతగా ప్రకటించాలని మహారాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త ఆదేశాలను జారీ చేసింది. ఇక తాజాగా మళ్లీ నోటాకే ఎక్కువ ఓట్లు పోలైతే పోటీ చేసిన అభ్యర్థుల విషయంలో స్పష్టమైన రూల్స్ పెట్టాలని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఆ నియోజకర్గంలో ఎన్నికలను రద్దు చేయాలని, అక్కడ మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని దాఖలైన పిటీషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. నోటా కన్న తక్కవ ఓట్లు పోలైన అభ్యర్థులను 5 సంవత్సరాల పాటు పోటీ చేయకుండా ఉండేలా కొత్త రూల్స్ చేర్చాలని సుప్రీంకోర్టు నోటీసుల్లో పేర్కొంది.

చదవండి:polls : రెండో విడత అభ్యర్థుల్లో అత్యంత సంపన్న అభ్యర్థి ఎవరంటే..?

Related News