»The Husband Who Carried His Wifes Dead Body On His Shoulder Without Money For Car Rental
wife’s dead body : ఆటో కిరాయికి డబ్బులు లేక భార్య మృతదేహాన్ని భుజంపై మోసిన భర్త…
చేతిలో చిల్లిగవ్వలేదు (Money) సొంత గ్రామానికి వెళ్లే దారి లేదు. తొటి వారిని సాయం అడగటానికి భాష(language ) రాదు. కానీ చనిపోయిన భార్య ను (Dead body) వందల కిలోమీటర్ల దూరంలో ఇంటికి తీసుకువెళ్లాలి. ఈ విషాద దయనీయ పరిస్దితుల్లో చేసేదేమీ లేక..భార్య డెడ్ బాడీని భుజాన వేసుకుని నడక ప్రారింభించాడు.
చేతిలో చిల్లిగవ్వలేదు (Money) సొంత గ్రామానికి వెళ్లే దారి లేదు. తొటి వారిని సాయం అడగటానికి భాష(language ) రాదు. కానీ చనిపోయిన భార్య ను (Dead body) వందల కిలోమీటర్ల దూరంలో ఇంటికి తీసుకువెళ్లాలి. ఈ విషాద దయనీయ పరిస్దితుల్లో చేసేదేమీ లేక..భార్య డెడ్ బాడీని భుజాన వేసుకుని నడక ప్రారింభించాడు. ఒడిశా (Odisha) రాష్ట్రంకు చెందిన సాములు .అతడి కష్టాన్ని చూసి చలించిన ఏపీ (AP) విజయనగరం (Vijayanagar) జిల్లా పోలీసులు సోంత ఉరుకి పంపించే ఏర్పాట్లు చేసి మానవత్వం చాటుకున్నారు. కోరాపుట్ జిల్లా పొట్టంగి బ్లాక్ సొరడ గ్రామానికి చెందిన ఈడే గురు అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతుంటే విశాఖ (Vishakaha ) జిల్లాలోని అనిల్ నీరుకొండ మెడికల్ కళాశాల ఆసుపత్రికి తీసుకొచ్చారు.
వారం రోజుల చికిత్స అనంతరం ప్రయోజనం లేదు ఇంటికి తీసుకెళ్లమనడంతో భార్యను తీసుకొని ఆటోలో బయలుదేరారు. మార్గ మధ్యలోనే ఆమె మృతి చెందడంతో.. ఆటో డ్రైవరు (Auto driver) చెల్లూరు రింగు రోడ్డులో దించేసి వెళ్లిపోయాడు. ఆసుపత్రికి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన గ్రామానికి వెళ్లడానికి అతను ఆటో రిక్షాను అద్దెకు తీసుకున్నాడు. కాని అతని భార్య విజయనగరం సమీపంలో మార్గమధ్యంలోనే మరణించింది. దీంతో ఆటో రిక్షా డ్రైవర్‌కు ₹ 2,000 చెల్లించి ఆ వ్యక్తి.. అంతకుమించి ముందుకు వెళ్లడానికి డబ్బు లేకపోవడంతో ఈడే సాములు తన భార్య మృతదేహాన్ని భుజంపై వేసుకుని చాలా కిలోమీటర్లు నడిచాడు. అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా.. ఒడిశాలోని సొరాడ గ్రామానికి తీసుకెళ్లడానికి పోలీసులు రూ.10వేలు ఖర్చు చేసి అంబులెన్స్‌ను (Ambulance) ఏర్పాటు చేశారు.దిక్కుతోచని స్థితిలో సాములు.. భార్య మృతదేహాన్ని భుజం మీద వేసుకొని కాలి నడకన స్వస్థలం బయలు దేరారు. భాష, దారి తెలియక భార్య మృతదేహన్ని భుజాన వేసుకుని నడిచి వెళ్లుతున్న సాములు గురించి స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. రూరల్ సీఐ తిరుపతి రావు, (CI tirapathirao) గంట్యాడ ఎస్ఐ కిరణ్ కుమార్ అతడిని ఆపి వివరాలు తెలుసుకున్నారు.
దారి తెలియక అప్పటికే నాలుగు కిలోమీటర్ల మేర వెనక్కి నడిచినట్లు గుర్తించిన వారు.. అతని బంధువులతో ఫోన్లో మాట్లాడారు. సాములకు భోజనం పెట్టించి, ఒడిశాలోని సుంకి వరకు అంబులెన్స్‌లో వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. మానవత్వం ప్రశ్నార్థకమవుతున్న ప్రస్తుత రోజుల్లో.. భార్యను కోల్పోయి బాధలో ఉన్న నిరుపేద వ్యక్తికి సాయం చేసిన పోలీసులను స్థానికులు అభినందించారు. ఈ విషాద ఘటన తొ మానవ సమాజం ఆలోచించవలసి ఉంది. దేశంలో కఠిక పేదరికానికి నిదర్శనంగా నిలిచే ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. వివిధ కారణాలతో మరణించిన కుటుంబ సభ్యుల మృతదేహాల్ని స్వస్థలాలకు (Own places) తరలించేందుకు కూడా డబ్బులు లేక, భుజాలపైనో, ద్విచక్ర వాహనాలపైనో మోసుకెళ్తున్న ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వలు చోరవతీసుకొని గవర్నమెంట్ హాస్సిటల్( Govt hospital) లో పార్దీవ దేహాన్ని తీసుకోని వెళ్లడానికి అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.