రాజస్థాన్‌లో సోమవారం తెల్లవారుజామును ఘోర రైలు ప్రమాదం జరిగింది. ముంబై టెర్నినస్ – జోద్‌పుర్ సూర్యనగరి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. 11 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో పలువురిగి గాయాలయ్యాయి. వీరిని అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలించారు. విషయం తెలియగానే ఘటనా ప్రాంతానికి అధికారులు చేరుకున్నారు. రైలులోని ప్రయాణీకులను బస్సులలో వారి వారి ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రమాదం ఉదయం 3 గంటల 27 నిమిషాలకు జోద్‌పుర్ డివిజన్లోని రాజ్‌కియావాస్-బోమాద్ర మధ్య చోటు చేసుకుంది. ఈ రైలు బాంద్రా టర్నినస్ నుండి జోద్‌పూర్‌కు వెళ్తోంది.
రైలు మార్వార్ జంక్షన్ నుండి బయలుదేరిన ఐదు నిమిషాల్లోనే ఈ ప్రమాదం జరిగింది. నార్తర్న్ వెస్టర్న్ రైల్వేస్ ప్రయాణీకులు, వారి కుటుంబ సభ్యుల కోసం హెల్ప్ లైన్ నెంబర్లను రిలీజ్ చేసింది. జైపూర్ హెడ్ క్వార్టర్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రమాదం నేపథ్యంలో ఈ మార్గంలో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద శబ్దం వచ్చి రైలు ఒక్కసారిగా ఆగిపోయిందని, తీరా చూస్తే పలు బోగీలు పట్టాలు తప్పాయని ప్రయాణీకులు చెప్పారు.