»Row Erupts Over Left Mlas Derogatory Remarks On Lord Ram Sita Lakshman
Kerala: సీతారామలక్ష్మణులపై అభ్యంతరకర పోస్టు పెట్టిన ఎమ్మెల్యే
కేరళలో వామపక్ష ఎమ్మెల్యే ఒకరు రాముడు, సీత, లక్ష్మణులపై ఫేస్బుక్లో పోస్ట్ చేయడం వివాదాస్పదమైంది. త్రిసూర్ అసెంబ్లీ స్థానం నుండి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ) ఎమ్మెల్యే పి బాలచంద్రన్ వివాదం తలెత్తడంతో ఫేస్బుక్ నుండి పోస్ట్‌ను ఉపసంహరించుకున్నారు.
Kerala: కేరళలో వామపక్ష ఎమ్మెల్యే ఒకరు రాముడు, సీత, లక్ష్మణులపై ఫేస్బుక్లో పోస్ట్ చేయడం వివాదాస్పదమైంది. త్రిసూర్ అసెంబ్లీ స్థానం నుండి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ) ఎమ్మెల్యే పి బాలచంద్రన్ వివాదం తలెత్తడంతో ఫేస్బుక్ నుండి పోస్ట్‌ను ఉపసంహరించుకున్నారు. తాను పాత కథనాన్ని మాత్రమే పోస్ట్ చేశానని, అయితే అది రామభక్తులకు బాధ కలిగించినందుకు చింతిస్తున్నానని అన్నారు.
తాజాగా ఫేస్బుక్లో పాత కథనాన్ని పోస్ట్ చేశానని ఆయన మరో ఫేస్బుక్ పోస్ట్‌లో తెలిపారు. ఎవరినీ నొప్పించడం నా ఉద్దేశ్యం కాదు. నేను కొన్ని నిమిషాల్లో దాన్ని తీసేశాను. కాబట్టి ఎవరూ దాని గురించి చింతించకండి. నేను క్షమాపణలు కోరుతున్నాను. బాలచంద్రన్‌ను విమర్శిస్తూ.. కోట్లాది మంది హిందువుల విశ్వాసాన్ని కమ్యూనిస్టు తుంగలో తొక్కిందని బీజేపీ ఆరోపించింది. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పార్టీ తెలిపింది.
హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు సర్వత్రా విమర్శలు రావడంతో బాలచంద్రన్ ఫేస్బుక్ పోస్ట్‌ను ఉపసంహరించుకున్నారు. రామాయణంపై తన వివాదాస్పద పోస్ట్‌లో, సీత రాముడు, లక్ష్మణులకు పరోటా, మాంసాన్ని వడ్డించిందని ఆరోపించారు. బిజెపి త్రిసూర్ జిల్లా అధ్యక్షుడు కెకె అనీష్‌కుమార్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ బాలచంద్రన్ పోస్ట్‌ను విమర్శించారు.