»Rajastan Baby Born With Four Legs And Hands Two Hearts In Churu District
Rajathan రెండు గుండెలు.. నాలుగేసి అవయవాలతో వింత శిశువు జననం
ఇంత కష్టమైన ప్రసవాన్ని సాధారణ ప్రసవంగా చేశాం. సాధారణ ప్రసవం చేయడం వలనే తల్లి ప్రాణాలు దక్కాయి’ అని తెలిపారు. ఇలాంటి జననాలు కలగకుండా ఉండేందుకు వైద్యులు అన్ని జాగ్రత్తలు చెబుతారు. సరైన ఆహార నియమాలు పాటించాలని సూచిస్తారు.
రాజస్థాన్ లో వింత శిశువు జన్మించింది. రెండు గుండెలు, నాలుగు చేతులు, నాలుగు కాళ్లతో శిశువు జన్మనివ్వడం వైద్యులను విస్మయపరిచింది. అయితే పుట్టిన అర్ధ గంటలోపే శిశువు మృతి చెందింది. ఈ సంఘటన వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చురూ జిల్లా రాజల్దేసార్ కు చెందిన హజారీ సింగ్ (19)కి ఆదివారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో రతన్ గడ్ లోని గంగారామ్ అనే ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. వెంటనే వైద్యులు సోనోగ్రఫీ పరీక్షలు చేయగా గర్భంలో వింత శిశువు ఉందని గుర్తించారు.
అనంతరం అతి జాగ్రత్తగా సాధారణ ప్రసవం చేశారు. నవజాత శిశువుకు నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్నాయి. రెండు గుండెలు, రెండు వెన్నెముకలు ఉన్నాయి. వైద్యులు ప్రత్యేక జాగ్రత్తలతో వైద్యం అందిస్తుండగా పుట్టిన 20 నిమిషాలకే శిశువు ప్రాణాలు కోల్పోయింది. కాగా హజారీ సింగ్ మాత్రం ఆరోగ్యంగా ఉంది. కాగా ఇలాంటి జననాలపై వైద్యులు పరిశీలన చేశారు. ఇటువంటి జననాలు కంజుక్టివల్ అనోమలీ అంటారని వైద్యులు తెలిపారు. క్రోమోజోమ్ లోపం వలన ఇలా శిశువులు వింత జన్మించే అవకాశం ఉందని వైద్యులు వివరించారు.
ఈ సంఘటనపై డాక్టర్ రీటా సొంగరా మాట్లాడుతూ.. ‘హజారీ సింగ్ కు సాధారణ ప్రసవమే జరిగింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉంది. ఆమెకు ఇతర ఆస్పత్రుల్లో చేసిన సోనోగ్రఫీ పరీక్షల్లో శిశువు సాధారణంగా ఉన్నట్టు రిపోర్టులు వచ్చాయి. నొప్పులు తీవ్రమైనప్పుడు శిశువు వాస్తవ పరిస్థితి తెలిసింది. ఇంత కష్టమైన ప్రసవాన్ని సాధారణ ప్రసవంగా చేశాం. సాధారణ ప్రసవం చేయడం వలనే తల్లి ప్రాణాలు దక్కాయి’ అని తెలిపారు. ఇలాంటి జననాలు కలగకుండా ఉండేందుకు వైద్యులు అన్ని జాగ్రత్తలు చెబుతారు. సరైన ఆహార నియమాలు పాటించాలని సూచిస్తారు. పోషకాహార లోపం వలన శిశువు సక్రమంగా అభివృద్ధి చెందకపోవడంతో ఇలాంటి జననాలు సంభవిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇకపైన గర్భిణీలు పౌష్టికాహారం తీసుకుంటే ఇలాంటివి చోటుచేసుకోవని సూచిస్తున్నారు.