కర్ణాటకలో గృహలక్ష్మి (Grilahakshmi) పథకాన్ని సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కలిసి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్ ద్వారా 1.1 కోట్ల మంది మహిళలకు లబ్ధి కలుగుతుంది. ఈ పథకం అమలు కోసం సర్కారు మీద ఏటా రూ.32 వేల కోట్లు ఖర్చు చేయనుంది. ఇది మహిళలకు ఉద్దేశించిన పథకం. ఇంటి పెద్ద అయినా లేడిస్కు ఆర్థిక బలం చేకూర్చేదే గృహలక్ష్మి పథకం. దీని ద్వారా అంత్యోదయ కార్డు, బిపిఎల్ కార్డు(BPL card), ఏపీఎల్ కార్డు కలిగి ఉండి, కుటుంబ పెద్దగా ఉన్న మహిళకు నెలకు రూ.2000 అందిస్తారు.
కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రధాన హామీల్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ (Congress) ప్రయత్నిస్తోంది. ప్రధానంగా ఈ ఐదు హామీలిచ్చింది. వీటిలో ‘శక్తి’, ‘గృహజ్యోతి (Grhajyothi)’, ‘అన్నభాగ్య’ పథకాల్ని ఇప్పటికే అమలు చేస్తోంది. తాజాగా ‘గృహలక్ష్మి’ని ప్రారంభించింది. మిగిలింది ‘యువ నిధి’ ఒక్కటే. దీన్ని కూడా త్వరలోనే అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని కాంగ్రెస్ చెప్పింది. ‘యువ నిధి’ పథకం కింద రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి (unemployment benefit) ఇవ్వబోతుంది. ఇది కూడా అమలు చేస్తే కాంగ్రెస్ ఎన్నికల హామీని నిలబెట్టుకున్నట్లు అవుతుంది.
కాంగ్రెస్ అమలు చేస్తున్న ఉచిత పథకాలపై భారతీయ జనతా పార్టీ (BJP) విమర్శలు గుప్పిస్తోంది. ఈ పథకాల్ని కాంగ్రెస్ సరిగ్గా అమలు చేయడం లేదని, ఎన్నికల హామీని తుంగలో తొక్కిందని విమర్శించింది. తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) కూడా ఇదే తరహా విమర్శలు చేస్తోంది. కర్ణాటకలో ప్రజలకు ఇచ్చిన హామీల్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవడం లేదని బీఆర్ఎస్ అంటోంది. అయితే, కాంగ్రెస్ మాత్రం హామీల అమలుకు ప్రయత్నిస్తోంది. ఇదే తరహా హామీల్ని తెలంగాణ(Telangana)లోనూ అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోం