కర్ణాటకలో జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఇప్పుడు ఆయనతో పొత్తు పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల్లో పోరాడుతున్న బీజేపీకి సమస్యగా మారింది. దీనిపై విపక్షాలు బీజేపీని ఇరుకున పెట్టడం ప్రారంభించాయి.
Rahul Gandhi: Prime Minister waives off lakhs of crores of loans taken by his billionaire friends
Rahul Gandhi : కర్ణాటకలో జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఇప్పుడు ఆయనతో పొత్తు పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల్లో పోరాడుతున్న బీజేపీకి సమస్యగా మారింది. దీనిపై విపక్షాలు బీజేపీని ఇరుకున పెట్టడం ప్రారంభించాయి. ప్రజ్వల్ రేవణ్ణకు ఓట్లు వేయాలని కోరినందుకు భారతీయ మహిళలకు ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం కోరారు. మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ మనవడు, హాసన్ సిట్టింగ్ ఎంపీ రేవణ్ణ 400 మంది మహిళలపై అత్యాచారం చేశారని, వారిపై అసభ్యకర వీడియోలు తీశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. కర్ణాటకలోని శివమొగ్గలో ర్యాలీ చేపట్టిన రాహుల్ గాంధీ.. రేవణ్ణను ‘మాస్ రేపిస్ట్’ అని వ్యాఖ్యానించారు.
ప్రజ్వల్ రేవణ్ణ కూడా బీజేపీ మద్దతుతో హాసన్ లోక్‌సభ స్థానం నుంచి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ స్థానానికి ఏప్రిల్ 26న పోలింగ్ జరిగింది. ప్రజ్వల్ ఒక మహిళను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు వచ్చాయి. 33 ఏళ్ల ప్రజ్వల్‌పై కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపట్టింది. విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. దీని తర్వాత, హాసన్ లోక్‌సభ స్థానంలోని నియోజకవర్గంలో చాలా వీడియోలు వైరల్‌గా మారాయి, అవి ప్రజ్వల్‌కు చెందినవిగా ప్రచారం జరుగుతోంది.
ప్రజ్వల్ రేవణ్ణ, ప్రధాని మోడీలను ఉద్దేశించి రాహుల్ గాంధీ శివమొగ్గలో మాట్లాడుతూ.. భారత మాతృమూర్తులు, సోదరీమణులకు కూడా ప్రధాని క్షమాపణలు చెప్పాలన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ 400 మంది మహిళలపై అత్యాచారం చేసి వీడియో తీశాడు. ఇది సెక్స్ స్కాండల్ కాదు సామూహిక అత్యాచారం. కర్ణాటకలో నిండు వేదికపై సామూహిక రేపిస్టును ప్రధాని సమర్థిస్తున్నారని రాహుల్ అన్నారు. ఈ రేపిస్టుకు కర్నాటక ఓటేస్తే నాకు లాభం చేకూరుతుందని ఆయన (మోడీ) అన్నారు. ప్రధాని తమను ఓట్లు అడిగేటప్పుడు ప్రజ్వల్ చేసిన పని తనకు తెలుసని కర్ణాటకలోని ప్రతి మహిళ తెలుసుకోవాలని రాహుల్ అన్నారు.