»Pune Porsche Accident Teenager S Grandfather Held For Wrongful Confinement Of Family Driver
Pune Porsche Accident: పుణె కారు యాక్సిడెంట్.. నిందితుడి తాత అరెస్ట్
Pune Porsche Accident: పుణెలో జరిగిన రోడ్డు ప్రమాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వేగంగా వస్తున్న లగ్జరీ కారు బైకును ఢీకొట్టడంతో ఇద్దరు మరణించారు. కారును 17 ఏళ్ల మైనర్ మద్యం మత్తులో నడుపుతున్నాడు.
Pune Porsche Accident: పుణెలో జరిగిన రోడ్డు ప్రమాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వేగంగా వస్తున్న లగ్జరీ కారు బైకును ఢీకొట్టడంతో ఇద్దరు మరణించారు. కారును 17 ఏళ్ల మైనర్ మద్యం మత్తులో నడుపుతున్నాడు. ఈ విషయంలో కొత్త కోణాలు నిరంతరం వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు మైనర్ నిందితుడు సురేంద్ర అగర్వాల్ తాతని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రైవర్‌ను బెదిరించి కిడ్నాప్ చేశారనే ఆరోపణలున్నాయి.
ఓ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. సురేంద్ర అగర్వాల్ డ్రైవర్ గంగారామ్‌ను బెదిరించాడు. ప్రమాదం జరిగిన సమయంలో తన కుమారుడు విశాల్ అగర్వాల్‌తో పాటు, డ్రైవర్ తానే కారు నడుపుతున్నట్లు వాంగ్మూలం ఇవ్వాల్సి వచ్చింది. శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో క్రైమ్ బ్రాంచ్ బృందం సురేంద్ర అగర్వాల్‌ను అతని ఇంటి నుంచి అరెస్టు చేసింది. ఒక రోజు ముందు పూణే పోలీసు చీఫ్ అమితేష్ కుమార్ మాట్లాడుతూ.. కారును మైనర్ డ్రైవ్ చేయలేదని చూపించే ప్రయత్నం జరిగిందని చెప్పారు.
డ్రైవర్ గంగారామ్ ఫిర్యాదు మేరకు పూణె క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సురేంద్ర అగర్వాల్‌ను అరెస్ట్ చేశారు. సురేంద్ర అగర్వాల్, అతని వ్యక్తులు తనను కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేశాడు. పోర్స్చే కారును నడిపినందుకు అతనిపై దాడి చేసి బెదిరించారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు ఎరవాడ పోలీసులు యువకుడి తాత, తండ్రిపై ఐపీసీ సెక్షన్ 365, 368 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. “ప్రమాదం తరువాత యువకుడి తాత, తండ్రి డ్రైవర్ ను తీసుకెళ్లి, మే 19 నుండి మే 20 వరకు తమ బంగ్లాలో తాళం వేసి ఉంచారు” అని క్రైమ్ బ్రాంచ్ అధికారి తెలిపారు. అనంతరం డ్రైవర్ భార్య అతడిని అక్కడి నుంచి విడుపించుకని వచ్చింది.
పూణె నగరంలో మే 18-19 మధ్య రాత్రి, 17 ఏళ్ల బాలుడు సుమారు రూ. 3 కోట్ల విలువైన పోర్షే కారును అతివేగంగా నడుపుతూ బైక్‌ను ఢీకొట్టాడు. వాహనం ఢీకొనడంతో బైక్ బ్యాలెన్స్ తప్పి చాలా దూరం రోడ్డుపై ఈడ్చుకెళ్లడంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలంలో ఉన్న వ్యక్తులు ప్రమాదంపై పోలీసులకు సమాచారం అందించగా, నిందితుడు మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన జరిగిన 14 గంటల తర్వాత, నిందితుడు కొన్ని షరతులతో కోర్టు నుండి బెయిల్ పొందాడు. 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పని చేయాలని, రోడ్డు ప్రమాదాల ప్రభావాలు, పరిష్కారాలపై 300 పదాల వ్యాసాన్ని రాయాలని కోర్టు ఆదేశించింది. తర్వాత వివాదం ముదిరిపోవడంతో కోర్టు అతడి బెయిల్‌ను రద్దు చేసింది. అయితే నిందితుడు మద్యం మత్తులో అతి వేగంతో కారు నడుపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఇప్పుడు పూణెలోని ప్రత్యేక కోర్టు కారు ప్రమాదం కేసులో ఆరుగురు నిందితులను జూన్ 7 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. కస్టడీకి పంపిన వారిలో నిందితుడు మైనర్ తండ్రి కూడా ఉన్నాడు. పూణే పోలీసులు ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో నిందితుడి తండ్రి, బార్ యజమాని, మేనేజర్‌పై ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే ఈ కేసును క్రైం బ్రాంచ్‌కు అప్పగించారు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తుపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. కాగా, మైనర్ బ్లడ్ రిపోర్టుతో పాటు ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయని ఓ అధికారి తెలిపారు. ఈ ప్రమాదం తర్వాత తన కొడుకు స్థానంలో డ్రైవర్‌ను మార్చడానికి నిందితుడి తండ్రి ప్రయత్నించినట్లు ఇప్పటివరకు విచారణలో వెలుగులోకి వచ్చిందని ఆయన అన్నారు.