»Pm Narendra Modi Lok Sabha Session Parasite Congress Zero In 13 States
PM Modi : మీకు వచ్చింది 100కు 99కాదు.. 543లో 99 మాత్రమే కాంగ్రెస్ మోదీ వ్యంగ్యాస్త్రాలు
లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో విపక్షాలు రచ్చ సృష్టించాయి. ప్రధాని ప్రసంగం ప్రారంభం కాగానే పలువురు విపక్ష ఎంపీలు తమ సీట్లపై లేచి నిలబడి నినాదాలు చేయడం ప్రారంభించారు.
PM Modi : లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో విపక్షాలు రచ్చ సృష్టించాయి. ప్రధాని ప్రసంగం ప్రారంభం కాగానే పలువురు విపక్ష ఎంపీలు తమ సీట్లపై లేచి నిలబడి నినాదాలు చేయడం ప్రారంభించారు. ప్రధాని మోదీ తన ప్రసంగం చేస్తున్నప్పుడు తన సీట్లో కూర్చోవాల్సి వచ్చింది. స్పీకర్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మందలించారు. ఆ తర్వాత ప్రధాని మోదీ ప్రసంగం మళ్లీ ప్రారంభమైంది.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ హఠాత్తుగా కూర్చోవడం, పార్లమెంటులో గందరగోళం తగ్గకపోవడంతో స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మందలించారు. ఇది మీ తప్పుడు మార్గం అన్నారు. ప్రధాని మళ్లీ మాట్లాడటం ప్రారంభించినప్పటికీ విపక్ష ఎంపీలు నినాదాలు చేస్తూనే ఉన్నారు. రాష్ట్రపతి తన ప్రసంగంతో మనందరికీ మార్గదర్శకంగా నిలిచారని నరేంద్ర మోదీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత, ప్రధాని మోడీ పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. 1984 ఎన్నికల తర్వాత దేశంలో 10 లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. అన్నింటిలో కాంగ్రెస్ 250కి చేరుకోలేకపోయింది. ఈసారి ఎలాగోలా 99 సాధించుకుందన్నారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీపై మోడీ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలోనే కూర్చోవాలని ప్రజలు మరోసారి తీర్పునిచ్చారు. వరుసగా మూడు సార్లు ఆ పార్టీ 100 మార్క్ దాటలేకపోయింది. ఇన్నిసార్లు ఓడినా వారిలో ఎలాంటి మార్పు రాలేదు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ప్రతిపక్ష నేతలకు అర్థం కావట్లేదు. 99 సీట్లు వచ్చాయని కాంగ్రెస్ నేతలు మిఠాయిలు పంచుకుంటున్నారు. కాంగ్రెస్‌కు వందకు 99 సీట్లు రాలేదు. 543లో 99 వచ్చాయి. వారి స్ట్రైక్ రేట్ 26శాతం మాత్రమే. ప్రజా తీర్పును వారు ఇకనైనా గౌరవించాలన్నారు ప్రధాని మోడీ.