»Pm Modis Degree Case Gujarat High Court Imposes Rs 25000 Fine On Arvind Kejriwal Says Pmo Need Not Furnish Certificates
Kejriwal కి గుజరాత్ హైకోర్టు షాక్..!
Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి ఊహించని షాక్ ఎదురైంది. గుజరాత్ హైకోర్టు ఆయనకు జరిమానా విధించింది. ప్రధాని నరేంద్ర మోడీ తన డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లను చూపించాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంలో కేజ్రీవాల్ కు చుక్కెదురైంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి ఊహించని షాక్ ఎదురైంది. గుజరాత్ హైకోర్టు ఆయనకు జరిమానా విధించింది. ప్రధాని నరేంద్ర మోడీ తన డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లను చూపించాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంలో కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. ప్రధాని మోడీ సర్టిఫికెట్ల అంశం ప్రజలకు సంబంధించిన విషయమా? అంటూ గుజరాత్ హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఈ పిటీషన్ వేసిన కేజ్రీవాల్ కు రూ.25 వేల జరిమానా విధించింది. మోడీ సర్టిఫికెట్లను చూపించాల్సిన అవసరం పీఎంవోకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ బీరేన్ వైష్ణవ్ తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ ఈ మేరకు తీర్పు వెలువరించింది.
మోడీ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విదార్హతల వివరాలు ఇవ్వాలంటూ పీఎంవో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (పీఐఓ), గుజరాత్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీల పీఐఓలకు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ జారీ చేసిన ఆదేశాలను కూడా న్యాయస్థానం కొట్టివేసింది. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆదేశాలను సవాల్ చేస్తూ గుజరాత్ యూనివర్సిటీ దాఖలు చేసిన పిటీషన్ ను గుజరాత్ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ కు జరిమానా విధించిన న్యాయస్థానం, ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
“ఇది ప్రజాస్వామ్యం. ఒక వ్యక్తి పదవి చేపడితే అతడు డాక్టరేట్ చేశాడా, లేక నిరక్షరాస్యుడా అనే తేడాలు ఉండరాదు. అయినా ఆ వ్యక్తి గోప్యతకు భంగం కలిగించడం తప్ప ఇందులో ప్రజా ప్రయోజనం ఏముంది?” అంటూ కోర్టు పేర్కొంది.