PM Modi: బీజేపీ జాతీయ మండలి సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. నవభారత్ నిర్మాణం కోసం అహర్నిశలు పనిచేద్దామని పిలుపునిచ్చారు. గడిచిన పదేళ్లలో దేశ రూపురేఖలు మారిపోయాయి అన్నారు. 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. భారత్ అభివృద్ధిని ప్రపంచమంతా గుర్తిస్తుందన్నారు. మూడోసారి గెలుపుపై ఎవరికీ ఎలాంటి అనుమానం అక్కర్లేదు. రాజకీయ పండితులెవరికీ మన గెలుపు కారణాలు దొరకవు. వీధుల వెంట వెళ్తున్నప్పుడు ప్రజల ఆశీర్వాద వర్షం కురుస్తోందన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతీయ మూలసూత్రం.
భిన్నత్వంలో ఏకత్వం మరింత బలోపేతం దిశగానే పనిచేస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. ఈసారి కూడా కాంగ్రెస్‌కి ఓటమి తప్పదు. వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమన్నారు. దేశంలోని చాలా అనర్థాలకు కారణం కాంగ్రెస్ పార్టీయే. అధికారం సంపాదించాలనే ఆలోచన తప్ప దేశాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీకి అజెండా లేదన్నారు. రక్షణ దళాల సామర్థ్యంపై కాంగ్రెస్‌కు స్పష్ట లేదు. నూతన సాంకేతిక పరిజ్ఞానం, నవీన ఆయుధ సంపత్తితో సైనిక దళాలను బలోపేతం చేశామన్నారు.