»Pm Modi Announcement To Extend Pradhan Mantri Garib Kalyan Anna Yojana By Next 5 Years Chhatisgarh Rally
PM Modi: మరో ఐదేళ్ల పాటు ఉచిత రేషన్.. 80 కోట్ల మంది పేదలకు లబ్ధి
PM Modi: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. శనివారం దుర్గ్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోడీ 'ప్రధాని మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన'ని వచ్చే ఐదేళ్ల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
PM Modi: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. శనివారం దుర్గ్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోడీ ‘ప్రధాని మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’ని వచ్చే ఐదేళ్ల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందించే పథకాన్ని వచ్చే ఐదేళ్ల పాటు బీజేపీ ప్రభుత్వం పొడిగించాలని నిర్ణయించినట్లు ప్రధాని చెప్పారు. దేశ ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలు తనకు ఎప్పుడూ పెద్ద నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తాయని ప్రధాని మోడీఅన్నారు.
పేదలకు ఉచిత రేషన్ అందించే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కోవిడ్ -19 సమయంలో ప్రారంభించబడింది. కానీ ప్రధాని మోడీ ఈ పథకాన్ని చాలాసార్లు పొడగించారు. కరోనా కాలం తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఈ పథకం గురించి చర్చించారు. ఇప్పుడు మరోసారి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని మోడీ వచ్చే ఐదేళ్ల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. కరోనా క్లిష్ట సమయం వచ్చినప్పుడు దేశంలోని పేద ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని ప్రధాని మోడీ అన్నారు. పేదలకు రెండు పూటల భోజనం అందేలా తమ బీజేపీ ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను ప్రారంభించింది. ఇది ఇంకా కొనసాగుతుంది.