»Gudivada Amarnath Warning Telangana Ministers You Should Take Care Of Yours Development
Gudivada Amarnath: తెలంగాణ మంత్రులు మీది మీరు చూసుకోవాలి
తెలంగాణలో ఎన్నికలు ఉన్న క్రమంలో అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలు ఆంధ్రా అభివృద్ధి గురించి మాట్లాడటం సరికాదని ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్(Gudivada Amarnath) స్పష్టం చేశారు. అంతేకాదు మీరు మీ ప్రాంతంలో చేసిన పనులు గురించి చెప్పుకోవాలని హితవు పలికారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్ నాథ్(Gudivada Amarnath)..తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఎన్నికలు వచ్చాయి కదా అని ఏపీ ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే ఊరుకునేది లేదని మంత్రి స్పష్టం చేశారు. ఏపీలో అమలు చేస్తున్న పథకాలు తెలంగాణ మేనిఫెస్టోలో ఉన్నాయని గుర్తు చేశారు. ఏపీ అభివృద్ధి గురించి మాట్లాడటం మానుకుని..బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో చేస్తున్న డెవలప్ మెంట్ గురించి మాట్లాడాలని హితవు పలికారు.
తెలంగాణలో రోడ్లు, ఏపీ రోడ్లు ఇలా ఉన్నాయని..మరోవైపు ఏపీలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని కేసీఆర్ ఇటివల ఖమ్మం జిల్లా సభలో పేర్కొన్నారు. దీనికి ముందు మంత్రి హరిశ్ రావు హైదరాబాద్ ను అమరావతిని పోల్చుతూ వ్యాఖ్యలు చేశారు. ఇలా పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పట్ల చులకనగా మాట్లాడటం సరికాదని గుడివాడ అన్నారు. మరోవైపు ఏపీ(ap) గురించి చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్లో ఎక్కువగా ఉండేది ఆంధ్రా ప్రజలేనని అంటున్నారు. అంతేకాదు తమవే ఎక్కువగా వ్యాపారాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ వస్తే చాలు అసలు హైదరాబాద్ దాదాపు సగం కంటే ఎక్కువగా ఖాళీ అవుతుందని ఏపీ ప్రజలు(ap people) పేర్కొంటున్నారు. ఏదీ ఏమైనా తెలంగాణలో ఎన్నికలు వస్తే ఆంధ్రాలో అభివృద్ధి, అక్కడి రాజధాని గురించి మాట్లాడటం సరికాదని ఇంకొంత మంది అంటున్నారు. అయితే తెలంగాణ మంత్రుల వ్యాఖ్యల విషయంలో మీరెమనుకుంటున్నారో కామెంట్(comments) రూపంలో తెలియజేయండి.