»People Who Are Looking For Diamonds Searching On The Road
Video Viral: వజ్రాల కోసం ఎగబడ్డ జనం..రోడ్డుపై వెతుకులాట
వజ్రాలు రోడ్డుపై పడ్డాయని తెలియడంతో స్థానికులు పోటాపోటీగా వాటిని వెతకడం మొదలుపెట్టారు. అయితే ఆఖరికి వారికి కొన్ని వజ్రాలు దొరికాయి. కానీ వాటి గురించి తెలిసి నోరెళ్లబెట్టారు. ఇంతకీ ఏం జరిగిందో మీరే చూడండి.
వజ్రాల (Diamonds) కోసం జనాలు గుమిగూడి రోడ్డుపై వెతికిన ఘటన గుజరాత్ (Gujarat)లోని సూరత్ (Surat)లో కలకలం రేపింది. వజ్రాల వ్యాపారానికి సూరత్ కేంద్రంగా ఉంది. తాజాగా ఆ నగరంలోని వరచ్చా ప్రాంతంలో ప్రజలు ఎగబడి మరీ వజ్రాల కోసం వెతికారు. రోడ్డుపై వజ్రాలు పడ్డాయనే పుకార్లు రావడంతో చాలా మంది ఆ వజ్రాల కోసం వెతకడం మొదలుపెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెప్టెంబర్ 24న ఈ ఘటన డైమండ్ మార్కెట్లో (Diamond Market) సంచలనం సృష్టించింది.
వైరల్ అవుతోన్న వీడియో:
https://twitter.com/i/status/1705842408704110611
కోట్ల విలువైన వజ్రాల ప్యాకెట్ (Diamonds Packet)ను ఓ వ్యాపారి అనుకోకుండా రోడ్డుపై పడేసినట్లుగా వార్తలు సృష్టించారు. ఆ పుకార్లను నమ్మిన ప్రజలు విలువైన రత్నాల కోసం వెతకడం మొదలుపెట్టారు. మార్కెట్ రోడ్డులో స్థానికులు వజ్రాల కోసం వెతుకుతున్న వీడియోలు నెట్టింట వైరల్ (Video Viral) అయ్యాయి.
అయితే ఈ ఘటనలో కొందరికి కొన్ని వజ్రాలు దొరికాయి. వాస్తవానికి అవి గిల్ట్ ఆభరణాలు, చీరల తయారీలో ఉపయోగించే అమెరికన్ వజ్రాలని తెలియడంతో అప్పటి వరకూ వెతికినవారంతా నిరాశ చెందారు. ఈ వీడియోకు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేశారు. ఆశకు హద్దూ పద్దూ లేదని ఒకరు కామెంట్ చేస్తే మరొకరు వజ్రాలు దొరికాయా రాజా అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.