యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (UPSC CSE) 2023 తుది ఫలితాలను ఏప్రిల్ 16న ప్రకటించింది. మొత్తం 1016 మంది అభ్యర్థులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన సీమా హైదర్‌కు నోయిడా కోర్టు నోటీసులు పంపింది. తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకోలేదని.. రెండో పెళ్లి చెల్లదనే విషయంలో కోర్టు నోటీసులు పంపింది.
పేదల పాలిట కేంద్రం దారుణంగా ప్రవర్తిస్తుందని తమిళనాడు సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. చివరికి సెల్పీ తీసుకున్నా జీఎస్టీ కట్టాలేమో అని ఎద్దేవా చేశారు.
పతంజలి యాడ్స్ కేసులో ధర్మాసనం ముందు హాజరైన బాబా రాందేవ్, బాలకృష్ణలను మరోసారి మందలించింది. వారు క్షమాపణ చెప్పినప్పటికీ మిమ్మల్ని నమ్మలేము, మీరెమన్న అమయకులా అని నిలదీసింది.
సాధారణంగా పిల్లలు తల్లిదండ్రుల బాటలో నడుస్తారు. కానీ గుజరాత్‌కి చెందిన దంపతులు మాత్రం పిల్లల బాటలో నడవాలని కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చి జైన సన్యాసులుగా మారేందుకు నిర్ణయం తీసుకున్నారు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో గత 45 రోజుల్లో భారీగా నగదు, మద్యం తదితరాలను పట్టుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రోజుకు కనీసం వంద కోట్ల మేర పట్టుబడుతున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
జమ్మూకశ్మీర్‌లోని జీలం నదిలో ఘోరప్రమాదం జరిగింది. విద్యార్థులు, స్థానికులను తీసుకెళ్తున్న ఓ చిన్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఎంపీ సందీప్ పాఠక్ కేజ్రీవాల్‌ను జైల్లో కలిశారు. అతనిని కరడుగట్టిన నేరస్థుల కంటే దారుణంగా కేజ్రీవాల్‌ను చూస్తున్నారని భగవంత్ మాన్ ఆరోపించారు.
ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న వేళ అధికారులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. అందులోనూ రాష్ట్రాల సరిహద్దుల్లో అయితే ప్రతి వాహనాన్ని చెక్ చేస్తున్నారు. ఈక్రమంలో తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెలికాప్టర్‌ను తనిఖీ చేశారు.
ఆధార్ కార్డులో పుట్టిన తేదీ తప్పు పడిందా.. అయితే వెంటనే మార్చుకోండి. ఇందుకోసం యూఐడీఏఐ వెసులబాటు కల్పించింది. ఎలాగో మీరు చూసేయండి.
సాధారణంగా అందరి కుటుంబాల్లోనూ నాలుగైదు ఓట్లు ఉండటం మనం చూస్తూనే ఉంటాం. అయితే అస్సాంలోని ఓ కుటుంబంలో మాత్రం ఏకంగా 350 మంది ఓటర్లు ఉన్నారట. ఆ కధాకమామీషు ఏంటో చదివేద్దాం రండి.
మేనిఫెస్టో విడుదల చేసిన ప్రధాని మోడీ దేశం వ్యాప్తంగా బుల్లెట్ రైలు సేవలు విస్తరించేందుకు బీజేపీ కసరత్తు చేస్తుందని చెప్పారు.
బోర్న్‌విటా హెల్త్ డ్రింక్ ట్యాగ్ కోల్పోయింది. దీన్ని హెల్త్ డ్రింక్ కేటగిరి నుంచి తీసేయాలని కేంద్రం అన్ని ఈ-కామర్స్ ప్లాట్‌ఫారంలకు ఆదేశాలు జారీచేసింది. అలాగే ఇతర పానీయాల విషయంలో కూడా ఇదే చర్య తీసుకోవాలని ఈ-కామర్స్‌ని ఆదేశించింది.
సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తమిళనాడులో ఇండియా కూటమి తరఫున ప్రచారం చేస్తున్నారు. కోయంబత్తూరులో కూటమి బహిరంగ సభకు వెళ్తుండగా మార్గమధ్యలో ఓ షాప్‌లో స్వీట్ కొని సీఎం స్టాలిన్‌కు కానుకగా ఇచ్చారు.
కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై మోదీ మరోసారి స్పందించారు. బిజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవిస్తుందని.. అంబేడ్కర్ కూడా ఇప్పుడు దీన్ని రద్దు చేయలేరన్నారు.