»Narendra Modi Even Babasaheb Ambedkar Cannot Abrogate The Constitution Now
Narendra Modi: బాబాసాహెబ్ అంబేడ్కర్ కూడా ఇప్పుడు రాజ్యాంగాన్ని రద్దు చేయలేరు
కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై మోదీ మరోసారి స్పందించారు. బిజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవిస్తుందని.. అంబేడ్కర్ కూడా ఇప్పుడు దీన్ని రద్దు చేయలేరన్నారు.
Narendra Modi: కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై మోదీ మరోసారి స్పందించారు. బిజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవిస్తుందని.. అంబేడ్కర్ కూడా ఇప్పుడు దీన్ని రద్దు చేయలేరన్నారు. రాజస్థాన్‌లోని ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వానికి రాజ్యాంగమే సర్వస్వం అని మోదీ తెలిపారు. దేశంలో ఎమర్జెన్సీ విధించడం ద్వారా రాజ్యాంగాన్ని నాశనం చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేసింది. ఇప్పుడు అదే పేరుతో మోదీపై దుర్భాషలాడుతోందని కాంగ్రెస్‌పై మోదీ మండిపడ్డారు. అణు నిరాయుధీకరణ గురించి విపక్షాలు మాట్లాడటం శోఛనీయమన్నారు.
పొరుగున అణ్వాయుధాలు కలిగిన దేశాలు ఉండగా.. వీటి నిర్మూలన గురించి మాట్లాడతారా? అని ప్రశ్నించారు. ఎవరి సూచనల మేరకు విపక్ష కూటమి పనిచేస్తోందని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. రాజ్యాంగంలో మార్పులు చేయాలంటే పార్లమెంట్లో బీజేపీకు భారీ మెజార్టీ రావాల్సిన అవసరం ఉందని పార్టీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే ఇటీవల వ్యాఖ్యలు చేశాడు. వీటిపై విపక్షాలు మండి పడుతున్నాయి. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని బీజేపీ సర్దిచెప్పుకునే ప్ర్రయత్నం చేసినప్పటికీ రాహుల్ గాంధీ సహా విపక్ష నేతలు దీనినే ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి.