ప్రధాని మోడీకి ఓటమి భయం పట్టుకుందని అందుకే నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే పేర్కొన్నారు. బీజేపీ 400 సీట్లు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు.
ఎంతో ఘనంగా మేళతాళాలతో పెళ్లి చేసుకున్న కూతురు అనివార్య కారణాల వల్ల విడాకులు తీసుకుంది. దీంతో ఓ తండ్రి మేళతాళాలతో ఎలా అత్తవారింటికి పంపించారో.. అదే మేళతాళాలతో పుట్టింటికి తీసుకొచ్చారు.
కొందరు భార్యలు లేనిపోని ఆరోపణలతో భర్త, అతని బంధువులపై కేసులు నమోదు చేస్తుంటారు. ఇలా కేసు నమోదు చేస్తున్నట్లయితే క్రూరత్వ చర్యగానే పరిగణించాల్సి ఉంటుందని బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ ధర్మాసనం తెలిపింది.
ఆమ్ ఆద్మీ పార్టీ తన ప్రచార గీతాన్ని ప్రారంభించింది. అయితే ఎన్నికల సంఘం దానిని నిషేధించింది. ఈ విషయమై ఎన్నికల సంఘాన్ని ఆ పార్టీ ప్రతినిధి బృందం కలిసింది.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కదులుతున్న వాహనాన్ని దహనం చేసిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. ఖైదీలతో వెళ్తున్న వ్యాన్‌లో మంటలు చెలరేగాయి.
తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోడీ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటుగా వ్యాఖ్యానించారు. బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది అని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని, రాజ్యంగమే తనకు పవిత్రగ్రంథం అని పేర్కొన్నారు.
దేశంలోని వివిధ విమానాశ్రయాలు, టెర్మినల్స్‌పై బెదిరింపు దాడుల ఉదంతం వెలుగులోకి వచ్చింది. 'టెర్రరిస్ట్స్ 111' అనే సంస్థ ఈ బెదిరింపును జారీ చేసింది.
ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో నిందితుడు, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కోర్టు నుంచి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. రోస్ అవెన్యూ కోర్టు అతని రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.
Aravind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వరుసగా రెండో రోజు విచారణ కొనసాగుతోంది. రెండో రోజు విచారణలో ఢిల్లీ సీఎం తరఫున అభిషేక్ మున్ సింఘ్వీ వాదనలు వినిపించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా డీప్ ఫేక్ వీడియో రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ వీడియో వైరల్ చేసిన వ్యవహారంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
లోక్‌సభ ఎన్నికల సమయంలో హసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్నపై లైంగిక వేధింపుల ఆరోపణలు దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. దీంతో జనతా దళ్ సెక్యులర్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు ప్రజ్వల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
ఉత్తర ప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ రెండు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఇంకా ఖారారు కాలేదు. ఈ రెండు స్థానాల్లో అమేథీ నుంచి ప్రియాంక గాంధీ, రాయ్‌బరేలీ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రియాంకా విముఖత చూపినట్లు తెలుస్తుంది.
ఛత్తీస్‌గఢ్ అడవిప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోలు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు నక్సలెట్స్ మరణించినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి నుంచి కుంబింగ్ చేపట్టారని.. ఇంకా కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.
తమ కోవీషీల్డ్ కోవిడ్ వ్యాక్సిన్‌తో కొన్ని సందర్భాల్లో దుష్పరిణామాలు ఏర్పడే అవకాశాలు లేకపోతేదని బ్రిటిష్ ఫార్మా కంపెనీ ఆస్ట్రోజెనికా కోర్టుకు తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి. చదివేయండి.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ఎయిర్‌పోర్ట్‌కి తాజాగా బాంబు బెదిరింపు ఈ మెయిల్ అందింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.