ప్రధాని నరేంద్ర ఈ రోజు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు సాయంత్రం జహీరాబాద్‌కు చేరుకుంటారు. మోడీ వస్తున్న సందర్భంగా బీజేపీ కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు.
ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలికి మరో షాక్ తగిలింది. ఆ సంస్థకు చెందిన 10 దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్స్ రద్దు అయ్యింది. దీనిని ఉత్తరాఖండ్ డ్రగ్ లైసెన్సింగ్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది.
Road Accident : రాజస్థాన్‌లోని జుంజును జిల్లాలో సూరజ్‌గఢ్-పిలానీ రహదారిపై ప్రయాణికులతో నిండిన టెంపో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 22 మంది గాయపడగా, వారిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉంది.
భారతీయ రైల్వేలో అత్యంత ఆధునిక రైలుగా పరిగణించబడే వందే భారత్‌లో సాంకేతిక లోపం కనిపించింది. దాంతో వందేభారత్ రైలు సూరత్ రైల్వే స్టేషన్‌లో చాలా సేపు నిలిచిపోయింది .
సుప్రీంకోర్టు నుంచి తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలైకి ఉపశమనం కలిగింది. ద్వేషపూరిత ప్రసంగం కేసులో విచారణ ప్రక్రియపై స్టే విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఓ వైపు దక్షిణాదిన ఎండలు దంచికొడుతున్నాయి. మరో వైపు భారత్‌లో పై వైపున ఉన్న జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో భారీ వర్షాలు, దండిగా హిమపాతాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్కూటర్ నడిపారు. కార్యకర్తలు, నేతలతో కలిసి స్కూటర్ రైడ్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.