బీహార్‌లోని భాగల్‌పూర్‌లోని నవ్‌గాచియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారు చేస్తుండగా సిలిండర్ పేలింది.
బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ కోల్‌కతాలో హత్యకు గురయ్యారు. ఈ నెలలో జరిగిన ఈ హత్య కేసుకు సంబంధించి ఇప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
కేదార్‌నాథ్ ఆలయం సమీపంలో ఓ హెలికాప్టర్‌కు పెను ప్రమాదం తప్పింది. గాల్లో ఉన్న హెలికాప్టర్ ల్యాండ్ అవకుండా గింగిరాలు తిరిగింది. దీంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతుంది.
అతి చిన్న వయసులో మౌంట్ ఎరవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన భారతీయ అమ్మాయిగా కామ్యా కార్తికేయన్ సరికొత్త రికార్డును సృష్టించింది. నేవిలో పనిచేసే తన తండ్రితో కలిసి ఈ ఫీట్ సాధించింది. ఈ మేరకు భారత నౌకాదళానికి చెందిన వెస్టర్న్ నేవల్ కమాండ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.
తీర్థయాత్రకని బయలు దేరిన మినీ బస్సు ఓ ట్రక్కును ఢీ కొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అసభ్యకర వీడియో కేసులో పరారీలో ఉన్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను వెంటనే విదేశాల నుంచి తిరిగి రావాలని మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ ఆదేశించారు.
ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లు, సైనికుల మధ్య మరోసారి భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. నారాయణపూర్, బీజాపూర్, దంతేవాడ సరిహద్దుల్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో ఏడుగురు నక్సలైట్లను సైనికులు హతమార్చారు.
బీహార్‌లోని సరన్ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల అనంతరం ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో ఒకరు మృతి చెందారు. వారి సంబంధించి నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య పేరు కూడా చేర్చబడింది.
నందిగ్రామ్ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మరోసారి వేడి రాజుకుంది. బుధవారం రాత్రి చీకట్లో సోనాచుడా ప్రాంతంలో సాయుధ బైకర్ల దాడిలో మహిళా బీజేపీ కార్యకర్త మరణించినట్లు చెబుతున్నారు.
బీజేపీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఆ పార్టీ విజయంతో దేశ స్టాక్ మార్కెట్‌లో కూడా రికార్డు స్థాయిలో దూసుకుపోతుందని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు.
మహారాష్ట్రలోని థానేలో కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడు కారణంగా భారీ అగ్నిప్రమాదం జరిగింది. పేలుడు చాలా బలంగా ఉంది. దాని ప్రతిధ్వని సమీపంలోని ప్రాంతాలకు వినిపించింది.
ప్రస్తుతం ఏడు దశల్లో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళలు పది శాతం లోపేనని ఏడీఆర్ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహ వేడుకల్లో కరీంనగర్ సంప్రదాయ కళ అయిన సిల్వర్ ఫిలిగ్రీ బహుమతుల్ని ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నిందితుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు అత్యుత్సాహం చూపించారు. నేరుగా ఆసుపత్రి లోపలున్న ఎమర్జెన్సీ వార్డులోకి కారును నడుపుకుంటూ వచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ మోదీని చంపేస్తాం అంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.