కర్ణాటకలో సెక్స్ స్కాండల్ ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఈ ఘటన కలకలం రేపుతోంది. దీంతో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకుంటున్నారు.
ఆదాయపు పన్ను శాఖ చెప్పుల వ్యాపారుల ఇళ్లలో జరుపుతున్న సోదాల్లో భారీ మొత్తం డబ్బులు పట్టుబడ్డాయి. ఓ వ్యాపారి ఇంట్లో దొరికిన డబ్బును లెక్కపెట్టలేక క్యాష్ మెషీన్లు సైతం మొరాయించాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
మద్యం కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో గత 15 నెలలుగా జైలులో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది.
ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు నుంచి ఎక్సైజ్ పాలసీ వ్యవహారానికి సంబంధించిన సీబీఐ కేసులో మరోసారి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఉపశమనం లభించలేదు. ఆమె జ్యుడీషియల్ కస్టడీని జూన్ 3 వరకు పొడిగిస్తూ సోమవారం కోర్టు తీర్పునిచ్చింది.
బీహార్ రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. బెగుసరాయ్‌లో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆరుగురు వ్యక్తులు గంగా నదిలో గల్లంతయ్యారు.
తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి)కి వ్యతిరేకంగా ఎలాంటి అవమానకరమైన ప్రకటనలు ప్రచురించకుండా కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి)ని కలకత్తా హైకోర్టు సోమవారం నిషేధించింది.
2047 నాటికి వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని మోదీ తెలిపారు. దీన్ని సాధించడానికి ఏం చేయడానికైనా వెనుకాడనని మోదీ తెలిపారు.
కర్ణాటకలో తీవ్ర చర్చనీయాంశమైన లైంగిక వేధింపుల కేసులో రాష్ట్ర మాజీ మంత్రి, జేడీఎస్ నేత హెచ్‌డి రేవణ్ణకు సోమవారం (మే 20) ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ప్రస్తుతం ఏ రాష్ట్రంలో చూసినా ట్రాఫిక్ ప్రధాన సమస్యగా మారింది. అందుకే సిక్కింలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సిస్టమ్ అమలు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ వెల్లడించింది.
మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు.
ఛత్తీస్‌గఢ్‌లోని కవార్ధాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెండు ఆకులు కోయడానికి వెళ్లిన కూలీల పికప్ అదుపు తప్పి 20 అడుగుల లోతులో పడింది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ సంచలన వార్త బయటకు వచ్చింది. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది.
ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన పూరీ జగన్నాథ ఆలయాన్ని ప్రధాని మోదీ ఈరోజు సందర్శించారు. అలాగే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే దీనికి సంబంధించిన ఫొటోను నరేంద్రమోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
నైరుతీ రుతుపవనాలు భారత దేశంలోకి ప్రవేశించాయి. అండమాన్ నికోబార్ దీవుల్లోకి అవి ముందుగా వచ్చినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మరో పక్క కొన్ని రాష్ట్రాల్లో ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
మూడు వారాల క్రితం ఓ పసిబిడ్డ తల్లి చేతుల్లోంచి పొరపాటున సన్‌షేడ్ మీదికి జారిపడింది. అపార్ట్‌మెంట్ వాసులు దీన్ని గుర్తించి తెలివిగా బిడ్డని రక్షించిన వీడియో వైరల్‌గా మారింది. దీంతో నెట్‌లో ఆ బిడ్డ తల్లిపై తీవ్రంగా ట్రోలింగ్స్ వచ్చాయి. డిప్రెషన్‌కు గురైన ఆమె ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచింది.