Bihar : బీహార్‌లోని భాగల్పూర్లోని నవ్‌గాచియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారు చేస్తుండగా సిలిండర్ పేలింది. ఈ దారుణ ఘటనలో ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు, వంట మనిషి, ఉపాధ్యాయుడు తీవ్రంగా కాలిపోయారు. రంగ్రా బ్లాక్‌లోని మద్రౌని గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం సిద్ధం చేస్తుండగా ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో పాఠశాలలో గందరగోళం నెలకొంది. ఈ ఘటనతో పాఠశాలలో చిన్నారుల్లో భయానక వాతావరణం నెలకొంది. ఈ ఘోర ప్రమాదంలో ఏ చిన్నారికి ప్రాణనష్టం జరిగిందనే దానిపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు.
కొత్త సిలిండర్‌లో రెగ్యులేటర్‌ను అమర్చుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించి అందులో ముగ్గురు సజీవదహనమయ్యారు. పేలుడు చాలా భయంకరంగా ఉండడంతో పాఠశాల గోడకు పగుళ్లు ఏర్పడి పేలుడు శబ్ధం కిలోమీటర్ల మేర వినిపించింది. గాయపడిన వారిలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇంద్రజిత్ సింగ్, ఉపాధ్యాయుడు బిపిన్ కుమార్, వంట మనిషి సవితాదేవి ఉన్నారు. రెండవ రౌండ్ కోసం కూరగాయలను వేడి చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ప్రధానోపాధ్యాయుడు ఇంద్రజిత్ సింగ్ పరిస్థితి విషమంగా ఉంది. ఉపాధ్యాయుడు బిపిన్ కుమార్, వంట మనిషి సవితాదేవి పరిస్థితి కూడా మరీ దారుణంగా ఉంది. నవ్‌గాచియా ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం, వెంటనే భాగల్పూర్లోని మాయాగంజ్ ఆసుపత్రికి తరలించారు.
ఘటన అనంతరం స్థానిక అధికారులు, ఆసుపత్రి అధికారులు పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనతో ప్రాథమిక పాఠశాలలోని ఇతర సిబ్బంది, పిల్లల్లో భయానక వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో విద్యార్థిని గాయపడినట్లు సమాచారం లేదు. బాధితులకు చికిత్స, భద్రత కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.