తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ నేతలందరూ.. సేవ్ కాంగ్రెస్ పేరిట చిన్నపాటి ఉద్యమం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. వీరి ఉద్యమం.. పార్టీకి చిక్కుల్లో పడేస్తోందనే అనుమానంతో… అధిష్టానం దిగ్విజయ్ సింగ్ ని రంగంలోకి దింపింది. కాగా… ఈ మేరకు తెలంగాణకు వచ్చిన ఆయన… పార్టీ నేతలందరికీ హెచ్చరికలు చేసినట్లు తెలుస్త...
చైనాలో, వివిధ దేశాల్లో కరోనా పెరుగుతుండటంతో రాజస్థాన్ బీజేపీ తన జన్ ఆక్రోశ్ యాత్రను రద్దు చేయాలని నిర్ణయించింది. అయితే రద్దు నిర్ణయం ప్రకటన తర్వాత కొద్ది గంటల్లోనే తిరిగి కోవిడ్ నిబంధనలతో యాత్రను ప్రారంభిస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై కూడా కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలు చేసిన విషయం తెలిసిందే. కోవిడ్ నిబంధనలతో యాత్ర చేపట్టాలని, లేదంటే క్యాన్సిల్ చేసుకోవాలని సూచ...
చైనాను అతలాకుతలం చేస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్ 7 భారత్‌లోను వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వేరియంట్ బీఎఫ్ 7 కేసులు భారత్‌లో మూడు నమోదయ్యాయి. ఇప్పటికే అక్టోబర్ నెలలో గుజరాత్‌లోని బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్‌లో గుర్తించగా, తాజాగా మూడు కేసులు వెలుగు చూశాయి. గుజరాత్‌లో రెండు, ఒడిశాలో ఒకటి నమోదయింది. ఒమిక్రాన్ (బీఎఫ్ 5)కు సబ్ వేరియంట్ బీఎఫ్ 7. ఈ వేరియంట్‌కు బలమైన ఇన్‌ఫెక్ష...
ప్రపంచ ట్రేడ్ వ్యాల్యూ సరికొత్త గరిష్టానికి చేరుకుంటోంది. 2023లో తిరిగి మందగమనం ఉండవచ్చుననే ఐక్య రాజ్య సమితి అంచనాలకు ముందు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్లోబల్ ట్రేడ్ వ్యాల్యూ 12 శాతానికి పెరిగి, 32 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చునని తెలిపింది. ఎనర్జీ ఉత్పత్తుల ట్రేడ్ భారీగా పెరగడంతో ట్రేడ్ గ్రోత్ వృద్ధి కనిపిస్తోందని యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ తన ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్‌లో మంగళవారం తెలిపింది...
ప్రయాణీకుల కోసం గత ఏడాది కేంద్ర ప్రభుత్వం రూ.59,000 కోట్ల మేర రాయితీ ఇచ్చిందని, ఇలాంటి పరిస్థితుల్లో రైల్వేలో సీనియర్ సిటిజన్లకు అప్పుడే రాయితీ కుదరదని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ మేరకు రైల్వే శాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రైల్వేలో పెన్షన్లు, వేతనాలు ఇప్పటికే చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. కాబట్టి సీనియర్లకు రాయితీ పునరుద్ధరణ అప్పుడే కుదరదని చెప్పారు. మహారాష్ట్రకు చెందిన స్వతంత్ర ఎంపీ నవ...
కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ జోడో యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన యాత్ర రాజస్థాన్ రాష్ట్రంలో కొనసాగుతోంది. కాగా… ఈ జోడో యాత్రలో ఆయనతో పాటు చాలా మంది ప్రముఖులు కలిసి అడుగులు వేస్తున్నారు. తాజాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ జోడో యాత్రలో పాల్గొని రాహుల్ వెంటన నడిచారు. బుధవారం ఉదయం సవాయ్ మాధోపూర్ నుంచి ప్రారంభమైన ‘జోడో యాత్ర’లో పాల్గొన్న ఆర...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… బీఆర్ఎస్ పార్టీని ప్రకటించిన సంగతి తెలసిందే. ఆ పార్టీని కేవలం తెలుగు రాష్ట్రాలకే కాకుండా… ఇతర రాష్ట్రాల ప్రజలకు కూడా పరిచయం చేసేందుకు కేసీఆర్ ప్లాన్ వేస్తున్నారు. ఈ క్రమంలో… ఆయన కుమార్తె కల్వకుంట్ల కవితతో పెద్ద స్కెచ్ ప్లాన్ వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న తెలంగాణ జాగృతి తరహాలో భారత్ జాగృతి ఏర్పాటు చేశారు. ఇప్పటికే భారత్ జాగృతి పేరు రిజిస్టర్ చేశ...
భారత్-చైనా మధ్య ఈ నెల 9వ తేదీన జరిగిన ఘర్షణ విషయంలో అగ్రరాజ్యం అమెరికా భారత్ వైపు నిలిచింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు భారత్ తీసుకునే ప్రతి చర్యకు తాము మద్దతు ఇస్తామని అమెరికా తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్‌లో ఎల్ఏసీ వెంబడి భారత్-చైనా ఘర్షణను యూఎస్ డిపార్టుమెంట్ ఆఫ్ డిఫెన్స్ పరిశీలిస్తోందని పెంటగాన్ తెలిపింది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా బలగాలు నిత్యం ఎల్ఏసీ వెంట తచ్చాడటం, సైనిక,...
లోకసభలో నిర్మలా సీతారామన్, రేవంత్ రెడ్డి మధ్య జరిగిన మాటల యుద్ధం చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయమై బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి రూపాయి, దేశ ఆర్థిక పరిస్థితి గురించి సభలో ప్రశ్నించారు. ఈ సమయంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ తెలంగాణ నుండి వచ్చిన వారికి హిందీ అంతగా రాదని, అలాగే, తనకు కూడా హిందీ అంతగా రాదని, ...
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని ఇటీవల కేంద్రమంత్రి కీలక ప్రకటన చేశారు. అయితే ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులు సభలో లేవనెత్తుతూనే ఉన్నారు. రాష్ట్ర విభజన సమయంలో నాటి కాంగ్రెస్ పార్టీ బిల్లులో పెట్టకుండానే, ప్రత్యేక హోదా హామీని ఇచ్చింది. తాము బిల్లులోని ప్రతి హామీని నెరవేరుస్తున్నామని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం చెబుతోంది. ప్రత్యేక హోదా బిల్లులో లేదని, అలాగే ఇప్పుడు సాధ్యం క...
బ్యాంకులు గత ఐదు ఆర్థిక సంవత్సరాలలో రూ.10 లక్షల కోట్ల మొండి బకాయిలను (NPA) రైటాఫ్ చేసినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో తెలిపారు. ఇందులో గత నాలుగు ఆర్థిక సంవత్సరాలలోనే రూ.8.5 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేసినట్లు తెలిపారు. అలాగే, ఇదే కాలంలో పబ్లిక్ రంగ బ్యాంకులకు చెందిన ఒక లక్ష మూడువేల కోట్ల రైటాఫ్ లోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. నాలుగేళ్లు దాటిన మొండి బకాయిలను బ్యాంకులు ర...
అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్లో వాస్తవాదీన రేఖ వెంట ఈ నెల 9వ తేదీన భారత్ – చైనా మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం వెలుగు చూసింది. ఈ ఘటనలో ఇరుపక్షాలు గాయపడ్డాయి. ఈ మేరకు భారత సైన్యం ప్రకటన విడుదల చేసింది. ఎంతమందికి గాయాలైన విషయం తెలియాల్సి ఉంది. అయితే మొదట్లో ఆరుగురికి గాయాలైనట్లుగా నివేదిక రాగా, ఆ తర్వాత ఈ సంఖ్య ఇరవైకి చేరుకుంది. అయితే గాయపడినవారు చైనా సైనికులే అధికమని తెలుస్తోంది. [&hel...
హిమాచల్ ప్రదేశ్‌లో ట్రెండ్‌ను మారుస్తామని భారతీయ జనతా పార్టీ (BJP) ప్రకటించినప్పటికీ, ఆ ఆశలు నెరవేరలేదు. గుజరాత్‌ను ఏడోసారి సునాయాసంగా దక్కించుకున్న బీజేపీ హిమాచల్ ప్రదేశ్‌లో గట్టి పోటీ ఇచ్చినట్లుగా కనిపించినప్పటికీ, ఆ తర్వాత వెనుకబడింది. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌దే పైచేయి. 1985 నుండి ఇక్కడ ప్రతి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే పార్టీ మారుతోంది. ఏ పార్టీ కూడా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఈసార...
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం (డిసెంబర్ 8) స్వల్ప లాభాల్లో ప్రారంభమై, దాదాపు అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. ఈ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. అయినప్పటికీ కాస్త ఫ్లాట్‌గానే కనిపిస్తోంది మార్కెట్. మొత్తానికి స్వల్ప లాభాల్లో ఉంది. మధ్యాహ్నం గం.11.40 సమయానికి సెన్సెక్స్ 60 పాయింట్లు లాభపడి, 62,469 పాయి...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికార, ప్రతిపక్ష స్థానానికి ఎగబాకే పరిస్థితులు కనిపించనప్పటికీ, పార్టీ ట్యాగ్ విషయంలో ఊరట దక్కే ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం గుజరాత్‌లో బీజేపీ 150 సీట్ల వరకు, కాంగ్రెస్ 20 సీట్లకు పైగా గెలుస్తుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ కనీసం డబుల్ డిజిట్ దక్కించుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు బీజేపీ తర్వాత కాంగ్రెస్ పార్టీని వ...