తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన వారిసు చిత్రంలోని రంజితమే పాటకు(ranjithame song) పుదుకోట్టె జిల్లా కలెక్టర్ కవితా రాము(Kavitha Ramu) డ్యాన్స్(dance) చేసి అదరగొట్టారు. తన తోటి మహిళా సిబ్బందితో కలిసి వేసిన స్టెప్పులు ఆకట్టుకున్నాయి. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా చేసిన ఈ వీడియో(viral video) ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రైల్వే జాబ్స్ కుంభకోణం(railway jobs scam) కేసు(case)లో లాలూ ప్రసాద్ కుటుంబంపై (lulu Prasad Yadav's family) జరిపిన దాడుల్లో కోటి రూపాయల లెక్కలో చూపని నగదుతోపాటు రూ.600 కోట్ల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ(ED) తెలిపింది. దీంతోపాటు 24 చోట్ల జరిపిన సోదాల్లో 1900 డాలర్ల విదేశీ కరెన్సీ, 540 గ్రాముల బంగారం, 1.5 కిలోలకు పైగా బంగారు ఆభరణాలు రికవరీ చేయబడ్డాయని వెల్లడించారు.
తన తండ్రి చిన్నప్పుడు లైంగిక వేధింపులకు గురి చేశాడని నటి జాతీయ మహిళా కమీషన్ (National Commission for Women)సభ్యురాలు ఖుష్బూ(Khushboo) ఇటీవల సంచలన ఆరోపణలు చేయగా తాజాగా ఢిల్లీ మహిళా కమిషన్ ( DCW) చీఫ్ స్వాతి మాలీవాల్ (Swati Maliwal) శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నతనంలో తాను కూడా తన తండ్రి చేతిలో లైంగిక వేధింపులకు గురైనట్టు తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)లో బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(Kavitha) ఫోన్ ను ఈడీ(ED) అధికారులు సీజ్ చేశారు. శనివారం ఉదయం కవిత ఈడీ విచారణకు వచ్చేటప్పుడు తన వెంట ఫోన్ ను తెచ్చుకోలేదు. ఢిల్లీలోని నివాసంలోనే ఆమె ఫోన్ ను విడిచి వచ్చారు. విచారణలో ఫొన్ గురించి ఈడీ(ED) అధికారులు అడగడంతో తన వద్ద ఫోన్ లేదని కవిత చెప్పారు. దీంతో వెంటనే ఇంటి నుంచి ఫోన్ ను తెప్పించాలని ఈడీ అధికారులు కోరారు. ఈడీ క...
minister vemula prashanth reddy:లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితను ( kavitha) ఈడీ అధికారులు ఢిల్లీలో గల తమ కార్యాలయంలో విచారిస్తున్నారు. కవితకు ( kavitha) మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (vemula prashanth reddy) అండగా నిలిచారు. కవితమ్మ.. ధైర్యంగా ఉండాలని ట్వీట్ చేశారు.
దేశ రాజధానిలో పర్యాటకుల దక్కే గౌరవం, మర్యాద ఇదా? అని ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అతిథిదేవో భవ అని గౌరవించే మన దేశంలో ఇలాంటి సంఘటన జరగడం దారుణమని పేర్కొన్నాయి.
Asaduddin owaisi:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (kavitha) ఈడీ విచారిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. సీఎం కేసీఆర్ (kcr) కుటుంబాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (modi) టార్గెట్ చేశారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
delhi liquor scam:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (delhi liquor scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (kavitha) ఈడీ అధికారులు (ed) ప్రశ్నిస్తున్నారు. ఈ కుంభకోణంలో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేయడంతో ఈ కేసుకు హైప్ నెలకొంది.
టెలిగ్రామ్ గ్రూపులు, వాట్సప్, ట్విటర్ తదితర సోషల్ మీడియా (Social Media)లో ఈ డాక్యుమెంటరీ లింక్ లను భారత ప్రభుత్వం డిలీట్ చేయించింది. మోదీ దారుణాలు వెలుగులోకి వస్తాయని భావించి ఈ డాక్యుమెంటరీని బయటకు రాకుండా అణచివేసింది.
అన్ని ఏర్పాట్లు చేసుకుంటుండగా గుండెపోటుకు గురై మృతి చెందడంతో పార్టీ నాయకులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన మృతితో పార్టీకి తీరని నష్టం చేకూరింది. ఆయన ప్రభావం దాదాపు ఐదు నియోజకవర్గాల్లో ఉండేది. ఫలితంగా ఆయన లోటు భర్తీ చేయలేనిదని స్థానిక కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
11th number:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (kavitha) 11వ నంబర్ (11th number) కలిసి రావడం లేదు. అవును ఈ రోజు (మార్చి 11వతేదీన) ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (delhi liquor scam) ఈడీ (ed) విచారణకు హాజరవుతారు. గతేడాది డిసెంబర్ 11వ తేదీన (december 11th) ఉదయం 11 గంటలకు (11am) కవితను (kavitha) ఆమె నివాసంలోనే సీబీఐ అధికారులు (cbi) విచారించిన సంగతి తెలిసిందే.
పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలనే భావిస్తున్నారు. అయితే అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉందని పోలీసులు సూచిస్తున్నారు. ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.
26 questions:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈ రోజు సీఎం కేసీఆర్ (cm kcr) తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (kavitha) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ed) అధికారులు విచారించనున్నారు. విచారణ అనంతరం ఆమెను అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని నిన్న సీఎం కేసీఆరే (cm kcr) స్వయంగా చెప్పారు కూడా.
ఓ 10 ఏళ్ల బాలిక(10 years old girl) తన అమ్మమ్మ గొలుసును లాక్కోవడానికి వచ్చిన దొంగను(thief) చితకబాదింది. దీంతో చైన్ స్నాచర్ పారిపోయాడు. ఫిబ్రవరి 25న జరిగిన ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్(viral video) కావడంతో మార్చి 8న ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణె(pune)లో జరిగింది.
కరోనా(Corona) తగ్గిపోయిందని అందరూ అనుకున్న టైంలో ఇప్పుడు మరో వైరస్ అందర్నీ భయాందోళనకు గురిచేస్తోంది. దేశంలో గత కొన్ని రోజుల నుంచి హెచ్3ఎన్2 వైరస్(H3N2 Virus) వ్యాప్తి ఎక్కువవుతోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే రెండు మరణాలు సంభవించడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.