ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)లో బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(Kavitha) ఫోన్ ను ఈడీ(ED) అధికారులు సీజ్ చేశారు. శనివారం ఉదయం కవిత ఈడీ విచారణకు వచ్చేటప్పుడు తన వెంట ఫోన్ ను తెచ్చుకోలేదు. ఢిల్లీలోని నివాసంలోనే ఆమె ఫోన్ ను విడిచి వచ్చారు. విచారణలో ఫొన్ గురించి ఈడీ(ED) అధికారులు అడగడంతో తన వద్ద ఫోన్ లేదని కవిత చెప్పారు. దీంతో వెంటనే ఇంటి నుంచి ఫోన్ ను తెప్పించాలని ఈడీ అధికారులు కోరారు. ఈడీ కార్యాలయం ఎదుట ఉన్న కవిత(Kavitha) డ్రైవర్ కు సమాచారం పంపి నివాసం నుంచి ఫోన్ ను తెప్పించారు.

మధ్యాహ్నం సమయంలో కవిత(Kavitha) డ్రైవర్ ఇంటి నుంచి ఫొన్ తెచ్చి కార్యాలయంలోని అధికారులకు అందజేశారు. ఆ ఫోన్ ను ఈడీ(ED) అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం. శనివారం ఉదయం 11 గంటల నుంచి ఈడీ అధికారులు కవితను ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam)లోని సహ నిందితులతో కలిపి ఆమెను విచారిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇష్యూలో ప్రధానంగా ఉన్న నిందితుల ఫోన్లను ధ్వంసం చేసినట్లు ఈడీ(ED) అధికారులు ఆరోపిస్తున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) కూడా తాను వాడిన 10 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ(ED) కోర్టుకు వెల్లడించింది. అసలు కవిత అన్ని ఫోన్లు ఎందుకు వాడింది? వాటిని ఎందుకు ధ్వంసం చేసిందనే దానిపై ఈడీ విచారిస్తున్నారు. మహిళా అధికారి సమక్షంలో కవిత(Kavitha)ను ప్రశ్నిస్తున్నారు.
మనీష్ సిసోడియా (Manish Sisodia), కవిత(Kavitha), అరుణ్ రామచంద్రన్ పిళ్ళై, దినేష్ అరోరా, బుచ్చిబాబు, సిసోడియా మాజీ కార్యదర్శి అరవింద్, ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్లను విడివిడిగా ఈడీ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఢిల్లీ ఈడీ(ED) ఆఫీసు వద్ద బీఆర్ఎస్(BRS) నాయకులు పెద్ద ఎత్తున మోహరించారు. కవితకు సంఘీభావంగా కేటీఆర్(KTR), హరీష్ రావు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. బీఆర్ఎస్(BRS) న్యాయనిపుణులు కూడా ఢిల్లీలోనే ఉన్నారు.