»Swati Maliwals Sensational Comments About Her Father Molesting Her As A Child
Swati Maliwal : తండ్రి చేతిలో వేధింపులకు గురియ్య స్వాతి మాలీవాల్ సంచలన కామెంట్స్
తన తండ్రి చిన్నప్పుడు లైంగిక వేధింపులకు గురి చేశాడని నటి జాతీయ మహిళా కమీషన్ (National Commission for Women)సభ్యురాలు ఖుష్బూ(Khushboo) ఇటీవల సంచలన ఆరోపణలు చేయగా తాజాగా ఢిల్లీ మహిళా కమిషన్ ( DCW) చీఫ్ స్వాతి మాలీవాల్ (Swati Maliwal) శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నతనంలో తాను కూడా తన తండ్రి చేతిలో లైంగిక వేధింపులకు గురైనట్టు తెలిపారు.
తన తండ్రి చిన్నప్పుడు లైంగిక వేధింపులకు గురి చేశాడని నటి జాతీయ మహిళా కమీషన్ (National Commission for Women)సభ్యురాలు ఖుష్బూ(Khushboo) ఇటీవల సంచలన ఆరోపణలు చేయగా తాజాగా ఢిల్లీ మహిళా కమిషన్ ( DCW) చీఫ్ స్వాతి మాలీవాల్ (Swati Maliwal) శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నతనంలో తాను కూడా తన తండ్రి చేతిలో లైంగిక వేధింపులకు గురైనట్టు తెలిపారు. మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన అవార్డుల కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన స్వాతి మాలివాల్ (Swati Maliwal)మాట్లాడుతూ, మహిళా అవార్డు గ్రహీతలు ఎదుర్కొన్న పోరాట గాధలు తన చిన్ననాటి సంఘర్షణను గుర్తుచేసిందని అన్నారు. తన తండ్రి నుంచి లైంగిక వేధింపులను తాను ఎదుర్కొన్నట్టు వెల్లడించారు.”మా నాన్న నన్ను బాగా కొట్టేవాడు. ఆయన ఇంటికి రాగానే మంచం కింద దాక్కునే దానిని. చాలా భయం వేసేది. ఇలాంటి అకృత్యాలకు వ్యతిరేకంగా మహిళా సాధికారతను ఎలా సాధించాలనే అనే దానిపై ఆ రాత్రంతా ఆలోచించేదాన్ని. మా నాన్న నా జట్టు పట్టుకుని గోడకేసి బలంగా కొట్టేవాడు.
అలాంటి క్షణాల్లోనే మహిళా సంక్షేమం కోసం పనిచేయాలనే సంకల్పం నాలో బలపడుతూ వచ్చింది” అని స్వాతి మాలీవాల్ తెలిపారు. నాలుగో తరగతి వరకూ తండ్రితో తాను ఉన్నట్టు చెప్పారు. స్వాతి మాలీవాల్ 2015లో ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party)ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ అయ్యారు. ఆ తర్వాత ఆమె పదవీ కాలం పొడిగించారు. డీసీడబ్ల్యూ చైర్పర్సన్ కాక ముందు, అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)సలహాదారుగా ఆమె పనిచేశారు. మహిళలపై అకృత్యాల గురించి ఆమె తరచు సోషల్ మీడియాలో ఘాటుగా స్పందిస్తుంటారు. ఢిల్లీలోని భద్రతా పరిస్థితిని తనిఖీ చేసేందుకు ఒకసారి రాత్రి సమయంలో వెళ్లినప్పుడు మద్యం మత్తులో ఉన్న క్యాబ్ డ్రైవర్ని పట్టుకునే ప్రయత్నం చేశానని, ఈలోపే విండోను వేగంగా మూసేడయంతో తన చేయి అందులో చిక్కుకోవడంతో అతను కొంతదూరం లాక్కెళ్లాడని అప్పట్లో ఆమె చేసిన కామెంట్స్ సంచలనమయ్యాయి.