»Rs 600 Crore Documents And Crore Cash Available In Railway Jobs Scam Case At Lalu Family Houses
Railway Jobs Scam: కేసులో రూ.600 కోట్ల పత్రాలు, కోటి క్యాష్ లభ్యం
రైల్వే జాబ్స్ కుంభకోణం(railway jobs scam) కేసు(case)లో లాలూ ప్రసాద్ కుటుంబంపై (lulu Prasad Yadav's family) జరిపిన దాడుల్లో కోటి రూపాయల లెక్కలో చూపని నగదుతోపాటు రూ.600 కోట్ల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ(ED) తెలిపింది. దీంతోపాటు 24 చోట్ల జరిపిన సోదాల్లో 1900 డాలర్ల విదేశీ కరెన్సీ, 540 గ్రాముల బంగారం, 1.5 కిలోలకు పైగా బంగారు ఆభరణాలు రికవరీ చేయబడ్డాయని వెల్లడించారు.
రైల్వే జాబ్స్ స్కాం(railway jobs scam) కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలో శనివారం రైల్వే శాఖ మాజీ మంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ బంధువుల(lulu Prasad Yadav’s family) ఇళ్లలో ఈడీ అధికారులు(ed officers) సోదాలు నిర్వహించారు. ఆ క్రమంలో రూ.1 కోటి లెక్కల్లో చూపని నగదుతోపాటు రూ.600 కోట్ల విలువైన పత్రాలను గుర్తించామని అధికారులు తెలిపారు. 24 చోట్ల జరిపిన సోదాల్లో 1900 డాలర్ల విదేశీ కరెన్సీ, 540 గ్రాముల బంగారం, 1.5 కిలోలకు పైగా బంగారు ఆభరణాలు రికవరీ చేయబడ్డాయని వెల్లడించారు. లాలూ ప్రసాద్ కుటుంబంతో(lulu Prasad family) పాటు పలు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ సహా వివిధ రంగాల్లో ఉన్న వారి సహచరుల వద్ద మరిన్ని ఆధారాలను వెలికితీసేందుకు దర్యాప్తు జరుగుతోందని కేంద్ర ఏజెన్సీ తెలిపింది.
ఈ కుంభకోణం కేసుకు సంబంధించి దేశ రాజధానిలోని బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ నివాసంలో శుక్రవారం ఈడీ(ed) దాడులు నిర్వహించడం గమనార్హం. న్యూఢిల్లీలోని ఆర్జేడీ నాయకుడిని ఆయన నివాసంలో 11 గంటలకు పైగా విచారించిన తర్వాత ఈడీ బృందం వెళ్లిపోయిందని తెలిసింది. ఈ కేసులో మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ బంధువులపై ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (NCR) బీహార్లో పలు ప్రాంతాల్లో ED దాడులు నిర్వహించింది. ఢిల్లీలోని లాలూ ప్రసాద్ కుమార్తె మిసా భారతితో పాటు బీహార్లోని ఆర్జేడీ నేత, మాజీ ఎమ్మెల్యే అబు దోజానా నివాసాల్లో ఈ సోదాలు జరిగినట్లు అధికారులు తెలిపారు.
లాలూ ప్రసాద్ భార్య, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవిని కూడా సీబీఐ సోమవారం ఆమె పాట్నా (bihar) నివాసంలో ఐదు గంటలకు పైగా ప్రశ్నించింది. లాలూ ప్రసాద్, రబ్రీ దేవితో పాటు మరో 14 మందిపై నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల కింద సీబీఐ ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేసింది.
ప్రతిపక్ష నేతలపై మాత్రమే కేంద్ర ఏజెన్సీలు దాడులు చేస్తున్నాయని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్(bihar cm nitish kumar) ఆరోపించారు. ఈ ఘటన 2017లో జరిగిందని పేర్కొన్నారు. అప్పుడు మేము జేడీయూ(jdu)-ఆర్జేడీ(rjd) విడివిడిగా ఉన్నామని గుర్తు చేశారు. ఐదేళ్లు గడిచాయని.. మేము ప్రస్తుతం కలవడంతోనే మళ్లీ దాడులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నందునే కేంద్ర ఏజెన్సీలు దాడులు నిర్వహిస్తున్నాయని నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు.