కేరళలోని కొచ్చి మునిసిపల్ కార్పొరేషన్(kochi Municipal Corporation) తన విధుల పట్ల నిర్లక్ష్యం(negligence)గా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) రూ.100 కోట్ల ఫైన్ విధించింది. కొచ్చిలోని చెత్త డంప్ సైట్‌లో అగ్నిప్రమాదం జరిగినందుకు గాను పర్యావరణ నష్ట పరిహారంగా చెల్లించాలని వెల్లడించింది.
జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా(Kashmir pulwama district)లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా..మరో 28 మంది గాయపడ్డారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే బస్సు బోల్తా(bus accident) పడినట్లు తెలుస్తోంది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా(amit shah)ను ఢిల్లీ(delhi)లో మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi), రామ్ చరణ్(ram charan) శుక్రవారం రాత్రి కలిశారు. ఆ క్రమంలో అమిత్ షా చెర్రీకి శాలువా కప్పి సత్కరించారు. RRR చిత్రంలో నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన సందర్భంగా కేంద్రమంత్రి అభినందించారు. అంతేకాదు ఇద్దరు లెజెండ్ హీరోలను కలుసుకున్నందుకు సంతోషంగా ఉందని ట్విట్టర్ వేదికగా తెలిపారు.
హిందుస్తాన్ ఆవామ్ మోర్చా అధినేత, బిహార్ మాజీ సీఎం జితన్ రాం మాంఝీ (Jitan Ram Manjhi) మరోసారి ఆసక్తికర కామంట్స్ చేశారు. రాముడి (Ramudu) కంటే రావణుడు చాలా పనిమంతుడు. కానీ ఇదంతా కల్పితం కాబట్టి. ఏదీ నమ్మాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు. తులసీదాస్ గురించి వాల్మీకి గురించి ప్రస్తావించారు. వారి రామాయణ, రామచరితమానస్(Ramacharitamanas) రచనల్లో అనేక తప్పిదాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.
Minister Atishi:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తీహార్ జైలులో ఊచలు లెక్కబెడుతున్న మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా (Manish Sisodia) బంగ్లాను నూతన మంత్రి అతిషికి (Atishi) కేటాయించారు. ఈ మేరకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ ఈ నెల 14వ తేదీన అతిషికి లేఖ రాసింది.
తెలంగాణ(Telangana) వ్యాప్తంగా మార్చి 8వ తేదికి 132 కేసులు నమోదయ్యాయి. మార్చి 15వ తేది వరకూ 267 మందికి కరోనా పాజిటివ్(Corona Positive) అని తేలింది. రెండో వారంలో పాజిటివిటీ రేటు 0.31 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణకు పలు చర్యలు తీసుకోవాలని కేంద్రం తెలంగాణ ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
YS Avinash:ఏపీ సీఎం జగన్‌ను ఆ పార్టీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఢిల్లీలో కలిశారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. వైఎస్ వివేకానంద హత్య కేసులో సీబీఐ అరెస్ట్ చేయడంపై ఆదేశాలు జారీ చేయలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో జగన్‌ను అవినాశ్ కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది.
బెంగళూరుకు(bangalore) చెందిన వేక్‌ఫిట్ సొల్యూషన్స్(Wakefit Solutions) సంస్థ మార్చి 17న స్లీప్ హాలిడే తీసుకోవాలని ఉద్యోగులను ఆశ్చర్యపరిచింది. D2C హోమ్ అండ్ స్లీప్ సొల్యూషన్స్ స్టార్ట్-అప్ అయిన Wakefit సొల్యూషన్స్ తన లింక్డ్‌ఇన్‌లో ఉద్యోగులందరికీ పంపించిన ఇమెయిల్ స్క్రీన్‌షాట్ అప్‌లోడ్ చేసి ప్రకటించింది. ఇది చూసిన ఉద్యోగులు(employees) సంతోషం వ్యక్తం చేశారు.
తెలంగాణ బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC kalvakuntla kavitha)కు మరో షాకింగ్ న్యూస్ ఎదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(delhi liquor scam case)లో ఈడీ మరోసారి నోటిసులు ఇచ్చిన క్రమంలో తన పిటిషన్ త్వరగా విచారించాలని శుక్రవారం కవిత సుప్రీంకోర్టును(supreme court) విజ్ఞప్తి చేశారు. కానీ కవిత చేసిన విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
యూపీ(UP) సంభాల్‌లోని(Sambhal) చందౌసి ప్రాంతంలో బంగాళదుంప కోల్డ్ స్టోరేజీ పైకప్పు కూలి.. ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటనలో మరో 11 మందిని అధికారులు రక్షించారు. సమాచారం తెలుసుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది చర్యలు చేపడుతున్నారు.
Ram Charan : అత్యంత ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ అందుకొని.. ఒక్కొక్కరుగా ఇండియాకు తిరిగొస్తున్నారు ట్రిపుల్ ఆర్ టీం మెంబర్స్. ఫస్ట్ ఆస్కార్ వేడుక అయిపోగానే ఇండియాకు తిరిగొచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అదే రోజు నాటు నాటు సాంగ్ డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ కూడా వచ్చేశాడు.
ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బ్రిటన్ లో చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే దుమారం రేపుతుండగా, గురువారం ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీ నేతలు మరోసారి విరుచుకు పడేందుకు ఆస్కారం ఇచ్చాయి. ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాను దురదృష్టవశాత్తు ఎంపీగా గెలిచానని వ్యాఖ్యానించాడు. దీనిని సరిద్దిదుకునే ప్రయత్నం చేసినప్పటికీ, జరగాల్సింది జరిగిపోయింది. దీంతో కేంద్రమంత్రులు ఆయన వ్యాఖ్యల పైన...
ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకునే వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. అది ఏమిటంటే ఇకపై ఆధార్(Aadhaar) కార్డ్ అప్ డేట్(update) కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ సౌకర్యం మార్చి 15 నుంచి జూన్ 14 వరకు అందుబాటులో ఉంటుందని కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో అప్ డేట్ చేసుకోవాలనుకునేవారు వినియోగించుకోవాలని సూచించారు.