Ram Charan : ఇండియాలో ల్యాండ్ అయిన రామ్ చరణ్.. మోదీతో మీటింగ్!
Ram Charan : అత్యంత ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ అందుకొని.. ఒక్కొక్కరుగా ఇండియాకు తిరిగొస్తున్నారు ట్రిపుల్ ఆర్ టీం మెంబర్స్. ఫస్ట్ ఆస్కార్ వేడుక అయిపోగానే ఇండియాకు తిరిగొచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అదే రోజు నాటు నాటు సాంగ్ డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ కూడా వచ్చేశాడు.
అత్యంత ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ అందుకొని.. ఒక్కొక్కరుగా ఇండియాకు తిరిగొస్తున్నారు ట్రిపుల్ ఆర్ టీం మెంబర్స్. ఫస్ట్ ఆస్కార్ వేడుక అయిపోగానే ఇండియాకు తిరిగొచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అదే రోజు నాటు నాటు సాంగ్ డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ కూడా వచ్చేశాడు. ఇక ఈ రోజు దర్శక ధీరుడు హైదరాబాద్‌లో ల్యాండ్ అయిపోయాడు. తన ఫ్యామిలీ మెంబర్స్ కార్తికేయ, కీరవాణి, రమా రాజమౌళి, కాలభైరవ, వల్లి గారితో తిరిగి హైదరాబాద్‌లో అడుగు పెట్టాడు. ఆస్కార్ అందుకొని ప్రతి ఒక్క భారతీయుడు గర్వ పడేలా చేసిన రాజమౌళి అండ్ టీంకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. రాజమౌళితో పాటు మెగా పవర్ స్టార్ కూడా ఇండియాలో ల్యాండ్ అయ్యాడు. కాకపోతే రామ్ చరణ్ దేశ రాజధాని ఢిల్లీలో దిగాడు. ఉపాసనతో పాటు ఢిల్లీలో ల్యాండ్ అయిన చరణ్‌కి అక్కడ గ్రాండ్ వెల్కమ్ లభించింది. అయితే చరణ్ ఢిల్లీకి వెళ్లడానికి ఓ బలమైన కారణం ఉంది. ఈరోజు సాయంత్రం మన భారత ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నాడు రామ్ చరణ్. ఈ రోజు జరగనున్న ‘ఇండియా టుడే కాంక్లేవ్’ ఈవెంట్లో మోదీతో పాటు చరణ్ కూడా హాజరు కానున్నాడు. ఢిల్లీలో జరగనున్న ఈ ఈవెంట్లో నరేంద్ర మోదీతో పాటు క్రికెట్ గాడ్ సచిన్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొనబోతోన్నారు. ‘ఐకాన్ ఆఫ్ ఇండియా’గా మోదీ ఈ ఈవెంట్లో ముఖ్య అతిథిగా హాజరు కాబోతోన్నారు. ఈ వేదికపై ట్రిపుల్ ఆర్ మూవీకి ఆస్కార్ వచ్చిన నేపథ్యంలో.. మోదీ చేతుల మీదుగా రామ్ చరణ్‌కు ఘన సన్మానం జరగనుంది. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత.. హైదరాబాద్‌కు రానున్నాడు చరణ్. ఇక్కడ మెగా పవర్ స్టార్‌కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు.. రెడీ అవుతున్నారు మెగాభిమానులు.