»The Cold Storage Roof Collapsed In Up 8 People Died 11 People Safe
UP:లో కూలిన పైకప్పు.. 8 మంది మృతి, 11 మంది సేఫ్
యూపీ(UP) సంభాల్‌లోని(Sambhal) చందౌసి ప్రాంతంలో బంగాళదుంప కోల్డ్ స్టోరేజీ పైకప్పు కూలి.. ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటనలో మరో 11 మందిని అధికారులు రక్షించారు. సమాచారం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చర్యలు చేపడుతున్నారు.
యూపీ(Uttar Pradesh) సంభాల్‌లోని చందౌసి(Sambhal) ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. బంగాళదుంప కోల్డ్ స్టోరేజీ పైకప్పు కూలిపోవడంతో మొత్తం ఎనిమిది మంది మరణించగా(8 people died), మరో 11 మందిని రక్షించారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందినట్లు మొరాదాబాద్ డీఐజీ శలభ్ మాథుర్ తెలిపారు. శిథిలాలలో చిక్కుకున్న వారి కోసం అధికారులు స్నిఫర్ డాగ్‌లను ఉపయోగిస్తున్నారని సంభాల్ డీఎం మనీష్ బన్సాల్ చెప్పారు.
ఉదయం ఎన్డీఆర్ఎఫ్(NDRF), ఎస్డీఆర్ఎఫ్(SDRF) ఇతర బృందాలు కూడా వస్తాయని ఆయన చెప్పారు. కోల్డ్ స్టోరేజీ యజమానిపై ఎఫ్ఐఆర్(FIR) నమోదు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ సంభాల్ ఎస్పీ చక్రేష్ మిశ్రా తెలిపారు. యజమానితో పాటు మరో ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని.. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించామని.. ప్రధాన నిందితులు కనిపించకుండాపోయారని ఎస్పీ వెల్లడించారు. వారికి గాలింపు చర్యలు చేపట్టామన్నారు.
ఈ ఘటన గురువారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే గోడౌన్ శిథిలావస్థకు చేరుకుందని వార్తలు వచ్చాయని చెప్పారు. ఈ కారణంతోనే కూలిందా లేదా మరేదైనా కారణం ఉందా అంశాలపై అధికారులు వివరాలను ఆరా తీస్తున్నారు. యజమానులను అంకుర్ అగర్వాల్, రోహిత్ అగర్వాల్‌గా గుర్తించిన పోలీసులు(police)..వారిపై కేసు నమోదు చేసినట్లు మొరాదాబాద్ డీఐజీ(DIG) శలభ్ మాథుర్ తెలిపారు.