»Wakefit Solutions World Sleep Day March 17th Sleeping Gift To Employees
World Sleep Day: ఉద్యోగులకు ఓ కంపెనీ షాకింగ్ గిఫ్ట్!
బెంగళూరుకు(bangalore) చెందిన వేక్‌ఫిట్ సొల్యూషన్స్(Wakefit Solutions) సంస్థ మార్చి 17న స్లీప్ హాలిడే తీసుకోవాలని ఉద్యోగులను ఆశ్చర్యపరిచింది. D2C హోమ్ అండ్ స్లీప్ సొల్యూషన్స్ స్టార్ట్-అప్ అయిన Wakefit సొల్యూషన్స్ తన లింక్డ్ఇన్లో ఉద్యోగులందరికీ పంపించిన ఇమెయిల్ స్క్రీన్‌షాట్ అప్లోడ్ చేసి ప్రకటించింది. ఇది చూసిన ఉద్యోగులు(employees) సంతోషం వ్యక్తం చేశారు.
ఈరోజు(మార్చి 17న) ప్రపంచ నిద్ర దినోత్సవం(World Sleep Day). ఈ సందర్భంగా హాయిగా పడుకోవాలని ఓ కంపెనీ తన ఉద్యోగులకు(employees) మెయిల్ చేసింది. అది చూసిన ఉద్యోగులు షాక్ అయ్యారు. తర్వాత మెయిల్ పూర్తిగా చదవిన ఉద్యోగులు నిజమేనని తెలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఎక్కడో కాదు. ఇండియా బెంగళూరులోని వేక్‌ఫిట్ సొల్యూషన్స్(Wakefit Solutions) సంస్థ ఈ ఆఫర్ ను వారి ఉద్యోగులకు ప్రకటించింది. తన ఉద్యోగులలో వెల్నెస్ పద్ధతులను ప్రోత్సహించడానికి ఈ సెలవు ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ నేపథ్యంలో మార్చి 17న అంతర్జాతీయ నిద్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికారికంగా తన ఉద్యోగులకు ఐచ్ఛిక సెలవు(holiday)ను మంజూరు చేసింది.
వేక్‌ఫిట్ సొల్యూషన్స్(Wakefit Solutions) తన లింక్డ్ఇన్లో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. అది ఉద్యోగులందరికీ పంపిన మెయిల్ స్క్రీన్‌షాట్. అందులో సర్ప్రైజ్ హాలిడే: అనౌన్సింగ్ ది గిఫ్ట్ ఆఫ్ స్లీప్” అనేది ఉద్యోగులకు పంపబడిన మెయిల్లో ఉంది. వేక్‌ఫిట్ తన ఉద్యోగులందరికీ ఐచ్ఛిక సెలవుదినంగా మార్చి 17న శుక్రవారం అంతర్జాతీయ నిద్ర దినోత్సవాన్ని(World Sleep Day) జరుపుకోవాలని ప్రకటించినందుకు తాము సంతోషిస్తున్నామని వెల్లడించింది. నిద్ర ఔత్సాహికులుగా, మేము స్లీప్ డేని ముఖ్యంగా శుక్రవారం నాడు పండుగగా భావిస్తామని తెలిపింది. అంతేకాదు మీరు HR పోర్టల్ ద్వారా ఈరోజును సెలవు దినంగా పొందవచ్చని స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు.
అంతేకాదు గత సంవత్సరం ఈ కంపెనీ తన వర్క్‌ఫోర్స్ కోసం “రైట్ టు నాప్ పాలసీ”ని ప్రకటించింది. దీని ద్వారా వారి ఉద్యోగులందరూ(employees) తమ పని వేళల్లో 30 నిమిషాలు(30 minutes) హాయిగా నిద్రపోయే(sleeping) అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. ఆ క్రమంలో శరీరాన్ని రీఛార్జ్ చేయడంతోపాటు లేచిన తర్వాత మళ్లీ పనిపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించడంలో నిద్ర ఉపకరిస్తుందని వారు భావిస్తున్నారు. దీంతోపాటు కార్యాలయంలో ఉత్పాదకత కూడా పెరుగుతుందని వారు చెబుతున్నారు. నిద్రలేమి ద్వారా అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఈ కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. ఈ క్రమంలో ఇతర సంస్థలు కూడా ఈ విధానాన్ని పాటించాలని సూచిస్తున్నారు. 2022 నుంచి తమ సంస్థ పని వేళల్లో నిద్రపోతున్న వ్యక్తుల్లో 21% పెరుగుదలను గుర్తించినట్లు తెలిపింది. అలసిపోయి మేల్కొన్న తర్వాత పని చేసే వ్యక్తుల్లో మంచి రిజల్ట్ కనిపించినట్లు స్పష్టం చేశారు.