Tik Tok : చైనా దేశానికి చెందిన టిక్ టాక్ యాప్ ని మన దేశంలో బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. కాగా... మన జాబితాలో ఫ్రాన్స్ ప్రభుత్వం కూడా చేరింది. టిక్‌టాక్ ను ఫ్రాన్స్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. ప్రైవసీ, సెక్యూర్టీ సమస్యల్ని ఎదుర్కొనేందుకు ఆ ప్రభుత్వం ఈ చర్యకు దిగింది.
గాంధీ కుటుంబ వారసత్వం, బలాన్ని హైలెట్ చేస్తూ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. తన సోదరి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) మూడు దశాబ్దాల నాటి సంఘటనను వివరిస్తూ చేసిన ఆవేశభరిత ప్రసంగానికి సంబంధించిన వీడియోను పంచుకున్నారు.ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన బయోని డిస్ క్వాలిఫైడ్ ఎంపీ గా ...
Kushboo : రాహుల్ గాంధీ పై వేటు ప్రస్తుతం దేశంలో తీవ్ర దుమారం రేపుతోంది. ‘‘మోడీలు అందరూ దొంగలేనా?’’ అన్నందుకు రాహుల్ గాంధీని కోర్టు దోషిగా తేల్చింది. ఓ వర్గాన్ని అవమానించారంటూ రాహుల్‌పై బీజేపీ నేత దాఖలు చేసిన కేసులో కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించడంతో ఆయన తన పార్లమెంట్ సభ్యత్వం కూడా కోల్పోవాల్సి వచ్చింది.
Bansuri Swaraj : బీజేపీ సీనియర్ నేత, దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె .. బన్సూరీ స్వరాజ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆమె ఢిల్లీ బీజేపీ లీగల్ సెల్ కో- కన్వీనర్ గా నియమితులయ్యారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తోన్న బాన్సురీకి రాజకీయాల్లో ఇది తొలి అడుగుగా విశ్లేషకులు పేర్కొన్నారు.
రాజస్థాన్ లోని సికార్ జిల్లాలో ఓ మహిళా డాక్టర్ ఆసుపత్రికి తాళం వేసి, రోడ్డు పైన పానీ పూరి బండి పెట్టుకున్న ఆశ్చరకర సంఘటన జరిగింది. ఈ బండి పైన ప్రయివేటు డాక్టర్ అని కూడా రాసి ఉంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే సదరు మహిళా డాక్టర్ పానీ పూరీ బండి పెట్టుకున్న పక్కనే మిగతా సిబ్బంది టీ దుకాణం పెట్టి విక్రయిస్తున్నారు.
నిజాం పాలన నుంచి హైదరాబాద్ విముక్తి కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను కాంగ్రెస్, బీఆర్‌ఎస్ విస్మరించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. కర్ణాటకలోని బీదర్ జిల్లాలోని గోరటలో అమరవీరుల స్మారక చిహ్నం, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా అమిత్ షా ఆదివారం వ్యాఖ్యానించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కవిత రిట్ పిటిషన్ పైన ఈ రోజు (సోమవారం, 27) న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది.
కవిత ఈ రోజు వరుసగా చేసిన పలు ట్వీట్లు (Kavitha Twitter) నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఓ చిన్నారి వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రత్యూష్ గార్నెపూడి అనే నెటిజన్ తమ కూతురు వీడియోను పోస్ట్ చేయగా.. దీనిని రీట్వీట్ చేశారు కవిత.
ఓ వైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) పైన అనర్హత వేటు పైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఓ కేసులో జైలు శిక్ష పడి, అనర్హత వేటు పడిన లక్ష్వద్వీప్ మాజీ పార్లమెంటు సభ్యుడు మహమ్మద్ ఫైజల్ (lakshadweep mp mohammed faizal) సుప్రీం కోర్టు (Supreme Court) ను ఆశ్రయించాడు.
Supreme Court:మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Viveka) హత్య కేసులో సీబీఐ తీరుపై సుప్రీంకోర్టు (supreme court) ఆగ్రహాం వ్యక్తం చేసింది. విచారణ అధికారిని మార్చాలని ఆదేశించింది. స్టేటస్ రిపోర్టులో (status report) ఎలాంటి పురోగతి లేదని అభిప్రాయపడింది. ఎంక్వైరీ (enquiry) మరింత వేగవంతం చేయాలని స్పష్టంచేసింది.
రాహుల్ పై అనర్హత వేటు (Disqualification)పై సోమవారం కాంగ్రెస్ పార్టీ సభ్యులు నలుపు దుస్తులు ధరించి సమావేశాలకు హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. రాహుల్ సభ్యత్వ రద్దుపై నిరసన వ్యక్తం చేశారు.
ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) పోలీసులు (Police) తనను చంపేస్తారేమోనని మాఫియా డాన్ గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ (gangster-turned-politician Atiq Ahmed) భయపడుతున్నాడు.
భారతదేశం(India)లో గత 24 గంటల్లో 1,805 కొత్త కోవిడ్ కేసులు(covid cases) నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వివరాలను వెల్లడించింది. నిన్న 1,890 కేసులతో పోల్చితే కేసులు స్వల్పంగా తగ్గాయి. కానీ మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 10,300కు చేరింది. దీంతో 134 రోజుల తర్వాత మళ్లీ యాక్టివ్ కేసుల(active cases) సంఖ్య 10 వేలు దాటింది.
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని తేజస్వి స్వాగతించాడు. పలుమార్లు కేసీఆర్, కేటీఆర్ తో సమావేశమయ్యాడు. హైదరాబాద్ లో ప్రగతి భవన్ ను కూడా సందర్శించాడు. నరేంద్ర మోదీ అరాచక పాలనను తేజస్వి యాదవ్ నిరసిస్తున్నాడు. ఇదే క్రమంలో తేజస్వి కుటుంబంపై దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.
తీవ్రంగా కొట్టడంతో చాందినీ మృతి చెందింది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని చిన్న కుమార్తెకు చెప్పి చాందినీ విద్యుద్ఘాతానికి గురై చనిపోయిందని నమ్మించాడు. అనంతరం కుమార్తె అంత్యక్రియలు సక్రమంగా పూర్తి చేశాడు. అయితే తన అక్క చనిపోవడాన్ని సోదరి ఆసియా జీర్ణించుకోలేకపోయింది.