»Uddhav Thackeray Warns Rahul Gandhi Against Insulting Veer Savarkar
Uddhav Thackeray: సావర్కర్‌ను అవమానిస్తే ఊరుకునేది లేదని రాహుల్ గాంధీకి హెచ్చరిక
స్వాతంత్ర వీర సావర్కర్ ను (Veer Savarkar) అవమానిస్తే ఊరుకునేది లేదని శివసేన (Shiv Sena - UBT) అధ్యక్షులు ఉద్దవ్ థాకరే ఆదివారం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత (Congress Party leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని హెచ్చరించారు.
స్వాతంత్ర వీర సావర్కర్ ను (Veer Savarkar) అవమానిస్తే ఊరుకునేది లేదని శివసేన (Shiv Sena – UBT) అధ్యక్షులు ఉద్దవ్ థాకరే ఆదివారం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత (Congress Party leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని హెచ్చరించారు. సావర్కర్ ను అవమానించడం వంటి వ్యాఖ్యలు చేస్తే విపక్ష కూటమిలో విబేధాలకు దారి తీయవచ్చునని రాహుల్ కు పరోక్షంగా హితవు పలికారు. ఆదివారం మాలేగావ్ లో జరిగిన ఓ ర్యాలీలో ఉద్దవ్ మాట్లాడారు. సావర్కర్ మాకు దేవుడని, ఆయనను అవమానించేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. మా దేవుళ్లను అంటుంటే మేం చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. సావర్కర్ ఏళ్ల కొద్ది అండమాన్ జైలులో (andaman jail) చిత్ర హింసలు అనుభవించారని, అది ఊహకు కూడా అందనిది అన్నారు. అదొక త్యాగం.. అలాంటి త్యాగాలను అవమానిస్తే ఊరుకోవాలా అని మండిపడ్డారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాము, కాంగ్రెస్ (congress), ఎన్సీపీ (NCP) కలిసి కట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని, కానీ రాహుల్ ఉద్దేశ్యపూర్వకంగా తన వ్యాఖ్యలతో రెచ్చగొడుతున్నారన్నారు. తద్వారా పోరాట సమయం వృథా అవుతోందన్నారు. ఇలాగే కొనసాగితే కూటమి కూడా ముక్కలు అయ్యే అవకాశాలు ఉంటాయని హెచ్చరించారు.
ఓ పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు ఇటీవల రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీంతో మొదటి నుండి ఉన్న చట్టాల ప్రకారం ఆయన లోకసభ సభ్యత్వాన్ని రద్దు చేసింది లోకసభ సెక్రటరీ. పరువు నష్టం కేసులో రాహుల్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. పరువు నష్టం కేసుకు సంబందించి ఓసారి నోరు జారిన రాహుల్.. మరోసారి అదే విధంగా మాట తుళ్లారు. తాను క్షమాపణ చెప్పేందుకు సావర్కర్ ను కాదని, తాను గాంధీని అని, గాంధీ ఎవరికి క్షమాపణలు చెప్పినట్లుగా చరిత్రలో లేదన్నారు. ఈ వ్యాఖ్యల పైన బీజేపీ మండిపడింది. సావర్కర్ ను అవమానిస్తున్నారంటూ నిప్పులు చెరిగింది. దీంతో ఉద్దవ్ థాకరే కూడా నోరు విప్పవలసి వచ్చింది.