తమిళనాడులోని కళ్లకురిచిలో జరిగిన విష మద్యం దుర్ఘటనలో ప్రజల మరణాలపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంది.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ భారతదేశానికి అతిపెద్ద అభివృద్ధి భాగస్వామి అని, బంగ్లాదేశ్‌తో మా సంబంధాలకు మేము అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మోదీ అన్నారు.
అయోధ్యలో రామమందిరానికి శంకుస్థాపన చేసిన పండిట్ లక్ష్మీకాంత దీక్షిత్ కన్నుమూశారు. లక్ష్మీకాంత దీక్షిత్ చాలా కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.
మర్డర్ కేసులో అరెస్టైన కన్నడ హీరో దర్శన్‌ను ఆ కేసులో ఏ2గా పోలీసులుచేర్చారు. అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో పవిత్ర గౌడను ఏ1గా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
గంగా నది ఎప్పటి నుంచో ఒకే దిశలో ప్రవహించడం లేదట. అది 2500 సంవత్సరాల క్రితం వచ్చిన భూకంపం వల్ల తన దిశను మార్చుకుని ప్రవహించడం మొదలుపెట్టిందని అధ్యయనంలో తేలింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ కేసులో నిందితుడైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతానికి జైలులోనే ఉండనున్నారు. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ఆయనకు గురువారం సాధారణ బెయిల్ మంజూరు చేసింది.
కేరళలోని మలప్పురంలో పొరుగు ఇంటి రిమోట్ కంట్రోల్ గేటులో ఇరుక్కుని తొమ్మిదేళ్ల బాలుడు చనిపోయాడు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యుల్లో రోదనలు మిన్నంటాయి.
చండీగఢ్‌లోని మొహాలీలో బ్యాంకులో కాల్పుల ఘటనతో ఆ ప్రాంతమంతా గందరగోళం నెలకొంది. బ్యాంకులో లావాదేవీ చేసేందుకు పలికి వచ్చిన ఓ వ్యక్తిని బ్యాంకు సెక్యూరిటీ గార్డు కాల్చిచంపాడు.
Hajj 2024: సౌదీ అరేబియాలోని మక్కాలో హజ్ యాత్రకు వెళ్లిన 98 మంది భారతీయులు మరణించారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ధృవీకరించింది.
Delhi Water Crisis : ఢిల్లీలో నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వ నీటి శాఖ మంత్రి అతిషి నేటి నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. నీటి సత్యాగ్రహానికి ముందు, అతిషి రాజ్‌ఘాట్‌లోని జాతిపిత మహాత్మా గాంధీ సమాధిని సందర్శించి నివాళులర్పించారు.
Heat Waves : ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాలు తీవ్రమైన వేడి, వేడిగాలులను ఎదుర్కొంటున్నాయి. ఈ సంవత్సరం వేడిగాలులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి.
తమిళనాడులో కల్తీ మద్యం తాగి ఇప్పటివరకు 47 మంది చనిపోయారు. ఈ అంశం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై శుక్రవారం అసెంబ్లీలో విపక్షాలు గందరగోళం సృష్టించాయి.
కేజ్రీవాల్‌కు మళ్లీ షాక్ తగిలింది. గురువారం దిల్లీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన బెయిల్‌ని శుక్రవారం దిల్లీ హైకోర్టు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
డబ్బుల కోసం కొందరు ఎంతటి దుర్మార్గానికైనా ఒడిగడుతున్నారు. స్నేహితుడి ఆస్తిని కొట్టేసేందుకు వీలుగా అతడికి మత్తిచ్చి లింగ మార్పిడి ఆపరేషన్ చేయించేశాడో ప్రబుద్ధుడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
క్రికెటర్ షమీని బ్యాట్మింటన్ క్రీడాకారిణి సానియా మీర్జా పెళ్లాడబోతున్నారంటూ ఇటీవల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ విషయమై సానియా మీర్జా తండ్రి స్పందించారు. ఆయన ఏమంటున్నారంటే?