కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఢిల్లీలో వరద లాంటి పరిస్థితిని కల్పించిందని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. యూపీకి వెళ్లాల్సిన నీటిని కూడా ఢిల్లీకి మళ్లిస్తున్నారని ఆ పార్టీ చెబుతోంది.
శ్రీహరి కోట నుంచి ప్రయోగించిన చంద్రయాన్-3 (Chandrayaan-3) రాకెట్ విజయవంతంగా కక్ష్యలోకి చేరింది. ఎల్‌వీఎం-3, ఎం-4 రాకెట్ విజయవంతంగా దూసుకెళ్లడంతో ఇస్రోలో సందడి వాతావరణం నెలకొంది. చంద్రునిపై అన్వేషణ కోసం చంద్రయాన్-3 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. చంద్రయాన్-3 రాకెట్ భూమి చుట్టూ 24 రోజుల పాటు తిరుగుతుంది. ఆగస్టు 23వ తేది లేదా 24వ తేదీన చంద్రునిపై చంద్రయాన్-3 రాకెట్ నిలుస్తుందని ఇస్రో తెలిపింది.
ఆగస్టు 15, 2003: అప్పటి ప్రధానమంత్రి, దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి చంద్రయాన్ కార్యక్రమాన్ని ప్రకటించారు. అక్టోబర్ 22, 2008: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్-1 టేకాఫ్. నవంబర్ 8, 2008: చంద్రయాన్-1 చంద్రుని పరిధిలోకి ప్రవేశం నవంబర్ 14, 2008: చంద్రుని ప్రభావం ప్రోబ్ చంద్రయాన్-1 నుంచి ఎజెక్ట్ చేయబడింది. దక్షిణ ధ్రువం దగ్గర కూలిపోయింది. ఆగస్ట్ 28, 2009: ఇస్రో ప్రకారం చంద్రయ...
సాధారణంగా పక్షులకు మాత్రమే వచ్చే బర్డ్‌ఫ్లూ ఇప్పుడు క్షిరదాల్లో వస్తుండడంతో మనుషులు కూడా జాగ్రత్తగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అప్రత్తంగా ఉండాలని సూచించింది.
దేశవ్యాప్తంగా వరదల కారణంగా 145 మంది మృతి చెందారు. కొండచర్యలు విరిగిపడుతుండడంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు. ఢిల్లీలో జూలై 16 వరకు పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.
ఇస్రో మూడవ మూన్ మిషన్ మరికొన్ని గంటల్లో ప్రయోగించనున్నారు. చంద్రయాన్-3(Chandrayaan 3) ఈరోజు (జూలై 14, 2023) మధ్యాహ్నం 2:35 గంటలకు ప్రయోగించనున్నారు. ఇస్రో అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.
థాయ్‌లాండ్‌లో జరుగుతున్న 25వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2023లో రెండో రోజైన గురువారం భారత అథ్లెట్లు మూడు స్వర్ణాలను గెలుచుకున్నారు. దీంతోపాటు కాంస్య పతకం కూడా కైవసం చేసుకున్నారు. వీరిలో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతి కూడా ఉండటం విశేషం.
కేరళలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అంబులెన్స్ ను ఢీ కొట్టిన మంత్రి కాన్వయ్ ఘనటలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ క్రమంలో అతను ఆపకుండా వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
శ్రీహరి కోట ప్రత్యేకత గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఇండియాలో శ్రీహరి కోట రాకెట్ ప్రయోగాలకు నిలయమైంది. అధునాతన సౌకర్యాలు ఉండటం వల్ల ఈ ప్రాంతం రాకెట్ ప్రయోగాలకు అనువైందని శాస్త్రవేత్తలు గుర్తించారు. రేపు శ్రీహరికోట నుంచి చంద్రయాన్3 ని ప్రయోగించనున్నారు.