Gambhir: యమునా నదీ మహోగ్రరూపం దాల్చింది. ఢిల్లీలో చాలా కాలనీల్లో వరదనీరు వచ్చింది. జనం ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈ క్రమంలో బీజేపీ నేత గౌతమ్ గంభీర్ (Gambhir) ట్వీట్ చేశారు. ఢిల్లీ వాసులారా.. ఇకనైనా మేల్కొండి అని పిలుపునిచ్చారు. ఢిల్లీ మురికి కాలువలా మారింది.. ఏదీ ఉచితంగా రాదని గుర్తించాలని కోరారు. అభివృద్ధిని పక్కనపెట్టి ఉచితం అని వెళ్లే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని తెలిపారు.
ఉచితం అనుకుంటే మూల్యం చెల్లించాల్సి వస్తోందని గంభీర్ (Gambhir) ట్వీట్ చేశారు. జనాలకు ఉచితాలు అని చెబుతూ ఆప్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఢిల్లీలో నిర్వహణ లోపం, సన్నాహక లోపాల వల్ల ఈ పరిస్థితి వచ్చిందని గంభీర్ అన్నారు. ఎన్నడూ లేనంతగా యమునా నదీ నీటి మట్టం పెరిగింది.
"Wake up Delhiites. Delhi has become a gutter. Nothing is for free, this is the PRICE!! ~ @GautamGambhir
వరద నీటితో ఢిల్లీ సీఎం నివాసం, అసెంబ్లీ, వీఐపీ జోన్లు మునిగాయి. దీంతో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. రెండు రోజుల నుంచి ఉత్తరాదిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హర్యానా బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. నీటి సామర్థ్యం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ కోరుతున్నారు. బ్యారేజీకి భారీ వరద నీరు చేరడంతో అదనపు నీరు విడుదల చేయాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.