సూరత్ లాంటి పెద్ద ప్రమాదం జార్ఖండ్‌లో కూడా జరిగింది. ఇక్కడ మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, జిల్లా అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.
గతకొన్ని రోజుల నుంచి త్రిపురలోని హెచ్‌ఐవీ కలకలం రేపుతుంది. విద్యార్థులపై ఈవ్యాధి తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈ వ్యాధి బారిన పడిన 47 మంది విద్యార్థులు మరణించారు. అయితే మొత్తం 828 మంది విద్యార్థులకు హెచ్‌ఐవీ సోకినట్లు త్రిపుర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ తెలిపింది.
జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులను హతమార్చడంతో ఆగ్రహించిన ఉగ్రవాదులు రాజౌరీలోని ఆర్మీ క్యాంపుపై దాడి చేశారు.
కూనో నేషనల్ పార్క్‌లో వర్షంలో ఆడుకుంటున్న చిరుత పిల్లల వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియోకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహానికి ముందు సంగీత్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శుక్రవారం జరిగిన సంగీత్ ఫంక్షన్ మొత్తంలో అంబానీ కుటుంబం మొత్తం డ్యాన్స్ చేసి అలరించింది. ఆ వీడియోని మీరిక్కడ చూసేయొచ్చు.
మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం సీబీఐకి నోటీసు జారీ చేసింది.
బ్రిటన్ ఎన్నికల ఫలితాల్లో కన్జర్వేటీవ్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. మరోసారి ప్రధాని కావాలన్న రిషి సునాక్ కలలు నెరవేరలేదు. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధానిగా ఆయన చేసిన సేవలను కొనియాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.
ఖలిస్తాన్ మద్దతుదారుడు అమృతపాల్ సింగ్ లోక్‌సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్‌కు చెందిన లోక్‌సభ ఎంపీ అమృతపాల్‌ను ప్రమాణ స్వీకారం చేసేందుకు అసోంలోని దిబ్రూగఢ్ జైలు నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు.