»Nischalananda Saraswati If Modi Installs Rams Statue Should We Applaud
Nischalananda Saraswati: రాముడి విగ్రహాన్ని మోదీ ప్రతిష్టిస్తే.. మేము చప్పట్లు కొట్టాలా?
అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ ఈ నెల 22న ప్రారంభం కాబోతుంది. ఈ సందర్భంగా పూరీ జగన్నాథ స్వామి ఆలయ మఠాధిపతి స్వామి నిశ్చలానంద సరస్వతికి ఆహ్వానం అందింది. అయితే మోదీ రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠంచడాన్ని స్వామి వ్యతిరేకించారు.
Nischalananda Saraswati: పూరీ జగన్నాథ స్వామి ఆలయ మఠాధిపతి స్వామి నిశ్చలానంద సరస్వతి అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠకి హాజరు కావట్లేదని తెలిపారు. అయితే ఒంటరిగా రావాలని ఆహ్వానం అందిందని పేర్కొన్నారు. ఒకవేళ వంద మందితో రావచ్చునని ఆహ్వానం వచ్చిన వెళ్లనని వివరణ ఇచ్చారు. ఎన్నో శతాబ్ధాలుగా ఆగిపోయి ఉన్న ఘట్టం తిరిగి ఇప్పుడు ఆరంభం కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఏదైన శ్రీరాముడి విగ్రహం అయోధ్య దేవాలయంలో శాస్త్రీయ విధివిధానాల నడుమ సాగాల్సి ఉంటుందన్నారు.
అయోధ్యలో రాముడి విగ్రహాన్ని మోదీ ప్రతిష్టించడాన్ని స్వామిజీ వ్యతిరేకించారు. ఆయన రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించడమేంటి? ఆయన ప్రతిష్టిస్తే మేము చప్పట్లు కొట్టాలా? రామ మందిరానికి ఇంతమంది రాజకీయ నాయకులు ఎందుకు? పూర్తిగా నిర్మించకుండా రామ మందిరాన్ని తెరవడం అరిష్టం? విగ్రహ ప్రతిష్ట సాధువులు, పూజారులు చేయాలి? తొందర ఎందుకు? ఎన్నికల కోసమా? అటువంటి కార్యక్రమానికి నేను రాను అని స్వామి నిశ్చలానంద సరస్వతి ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.