»Ncrb Data Suicide Reasons Daily Wage Workers Unemployed
NCRB Data: ఆత్మహత్యలకు పాల్పడే వారిలో ఉపాధి పొందుతున్న వారే అధికమట
NCRB Data: ఎసీఆర్బీ తన నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో షాకింగ్ విషయాలు వెలువడ్డాయి. 2022లో నిరుద్యోగుల కంటే ఉద్యోగస్తులే ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్నారని తేలింది. ఇందులో స్వయం ఉపాధి పొందుతున్న వారు కూడా ఉన్నారు.
NCRB Data: ఎసీఆర్బీ తన నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో షాకింగ్ విషయాలు వెలువడ్డాయి. 2022లో నిరుద్యోగుల కంటే ఉద్యోగస్తులే ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్నారని తేలింది. ఇందులో స్వయం ఉపాధి పొందుతున్న వారు కూడా ఉన్నారు. చాలా మంది రోజువారీ కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎన్సీఆర్బీ ఆత్మహత్యలకు సంబంధించిన గణాంకాలే కాకుండా దేశవ్యాప్తంగా నమోదైన క్రైం రేటు గురించి కూడా ప్రకటించింది. ఆత్మహత్య బాధితుల్లో దాదాపు 26 శాతం మంది రోజువారీ కూలీలే ఎక్కువగా ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య గత ఐదేళ్లలో క్రమంగా పెరుగుతుందని నివేదిక చూపుతోంది.
ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం గతేడాది 1.71 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 2021తో పోలిస్తే 4.2 శాతం పెరగ్గా.. 2018తో పోలిస్తే 27 శాతం పెరిగింది. ఐదేళ్ల క్రితం 10.2గా ఉన్న ఆత్మహత్యల రేటు 2022లో లక్ష జనాభాకు 12.4కు పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. కుటుంబ సమస్యలు, అనారోగ్యాలే ఆత్మహత్యలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ఇవి ఆ మరణాలలో సగానికి పైగా ఉన్నాయి. 9.3 శాతం ఆత్మహత్యలు ప్రేమ వ్యవహారాలు, వివాహ సంబంధ సమస్యల కారణంగా జరిగాయి. ఆత్మహత్య కేసుల్లో సగానికిపైగా ఉరివేసుకుని జీవితాలను ముగించినట్లు నివేదిక చూపుతోంది. అనంతరం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడుతున్న వారున్నారు.