»Navjot Singh Sidhu If Proven To Be A Lie He Will Quit Politics
Navjot Singh Sidhu: అబద్ధమని రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా!
పంజాబ్ జైళ్లలో డ్రగ్స్ అమ్ముతున్నారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆరోపించారు. తాను చెప్పింది నిజమని అన్నారు. తప్పని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన పేర్కొన్నారు.
Navjot Singh Sidhu: పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆ రాష్ట్రంలోని జైళ్లలో డ్రగ్స్ అమ్ముతున్నారని ఆరోపించారు. తాను చెప్పింది నిజమని.. తప్పని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ను నియంత్రించడంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌పై నవజ్యోత్ మండిపడ్డారు. లా అండ్ ఆర్డర్, డ్రగ్ మాఫియా, జైళ్ల విధానాలపై వారంలోగా రిపోర్ట్ అందజేయాలని హైకోర్టు కోరింది. అయితే జైళ్ల శాఖ మంత్రి అయిన సీఎం భగవంత్ మాన్ ఏం చేశారని నవజ్యోత్ ప్రశ్నించారు. జైళ్లలో డ్రగ్ ట్యాబ్లెట్లు అమ్ముతున్నారు. నేను చెప్పింది అబద్ధమని రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు.
అలాగే పంజాబ్‌లో పెరుగుతున్న అప్పులు, శాంతిభద్రతలపై కూడా నవజ్యోత్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం అవసరాలకు వినియోగించడం లేదన్నారు. అందుకే పంజాబ్‌కు అందాల్సిన రూ.8,000 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు. కేంద్ర పథకంలో 40 శాతం వాటా ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవని విమర్శించారు. 1988లో రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించిన కేసులో నవజ్యోత్‌కు సుప్రీంకోర్టు ఒక ఏడాది కఠిన కారాగార శిక్ష విధించింది. అయితే సత్ప్రవర్తన కారణంగా గడువుకు ముందే జైలు నుంచి విడుదలయ్యారు.