»Mukesh Ambani Threat Emails Mumbai Police Arrest 19 Years Old
Mukesh Ambani Threat: ముకేశ్ అంబానీని చంపుతామన్న వ్యక్తి అరెస్ట్
పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి గత నాలుగు రోజుల్లో మూడు బెదిరింపు ఇమెయిల్స్ వచ్చాయి. ఈ బెదిరింపు ఇమెయిల్‌లు పంపినందుకు తెలంగాణకు చెందిన 19 ఏళ్ల యువకుడిని ముంబైలోని గామ్దేవి పోలీసులు శనివారం (నవంబర్ 4) అరెస్టు చేశారు.
mukesh ambani received death threat email for rs 20 crore demand
Mukesh Ambani : పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి గత నాలుగు రోజుల్లో మూడు బెదిరింపు ఇమెయిల్స్ వచ్చాయి. ఈ బెదిరింపు ఇమెయిల్‌లు పంపినందుకు తెలంగాణకు చెందిన 19 ఏళ్ల యువకుడిని ముంబైలోని గామ్దేవి పోలీసులు శనివారం (నవంబర్ 4) అరెస్టు చేశారు. నిందితుడిని గణేష్ రమేష్ వనపర్ధిగా గుర్తించారు. నిందితుడిని నవంబర్ 8 వరకు పోలీసు కస్టడీకి పంపినట్లు పోలీసులు తెలిపారు. గత వారం, అంబానీ నుండి డబ్బు డిమాండ్ చేసిన ఐదు ఇమెయిల్‌లు వచ్చాయి. చంపేస్తానని బెదిరింపులు కూడా వచ్చాయి. కొంతమంది టీనేజర్లు తుంటరిగా ఇలా చేసినట్లు సీనియర్ ముంబై పోలీసు అధికారి తెలిపారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ముఖేష్ అంబానీకి మొత్తం ఐదు ఈమెయిల్స్ అందగా, అందులో మొత్తం రూ.400 కోట్లు డిమాండ్ చేశారు. అయితే నిందితుల్లో ఒకరు అరెస్ట్ అయ్యారు.
మొదటి బెదిరింపు ఇమెయిల్ అక్టోబర్ 27న వచ్చింది. అందులో షాదాబ్ ఖాన్ అనే బాలుడు.. మాకు 20 కోట్లు ఇవ్వకపోతే మా దగ్గర అత్యుత్తమ షూటర్లు ఉన్నారు చంపేస్తామన్నారు. దీని తర్వాత అతనికి మరో బెదిరింపు ఇమెయిల్ పంపబడింది. ఇందులో మొదటి ఈమెయిల్‌పై చర్యలు తీసుకోనందుకు బెదిరించి.. ఇప్పుడు రూ.200 కోట్లు కావాలని చెప్పారు. రెండో ఈమెయిల్లో ‘మా డిమాండ్లు నెరవేరకపోతే అంబానీ పేరు మీద డెత్ వారెంట్ జారీ చేస్తాం’ అని రాసి ఉంది. 400 కోట్లు డిమాండ్ చేస్తూ అంబానీ అధికారిక ఇమెయిల్ ఐడీపై మూడో ఇమెయిల్ పంపినట్లు సోమవారం వార్తలు వచ్చాయి. దీని తర్వాత మంగళవారం, బుధవారం అతనికి అలాంటి మరో రెండు ఇమెయిల్‌లు వచ్చాయి. ఈమెయిల్ ఐపీ అడ్రస్‌ను పరిశీలించగా నిందితుడు తెలంగాణలో ఉన్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ నేరంలో మరికొంత మంది ప్రమేయం ఉందా లేదా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.