»Mukesh Ambani Ranks 9th In Forbes Worlds Billionaires List 2023 Highest In Asia
Mukesh Ambani : అత్యంత సంపన్నుడిగా ముకేష్ అంబానీ..!
Mukesh Ambani : ముకేష్ అంబానీ.. పరిచయం అవసరం లేని పేరు. మన దేశంలో అత్యంత సంపన్నులు ఎవరు అనగానే ముందుగా వినపడేది ఆయన పేరే. ఈ విషయంలో మరోసారి ఘనత సాధించారు. ఆసియాలోనే ప్రపంచ కుబేరుడిగా ఆయన నిలిచారు.
ముకేష్ అంబానీ.. పరిచయం అవసరం లేని పేరు. మన దేశంలో అత్యంత సంపన్నులు ఎవరు అనగానే ముందుగా వినపడేది ఆయన పేరే. ఈ విషయంలో మరోసారి ఘనత సాధించారు. ఆసియాలోనే ప్రపంచ కుబేరుడిగా ఆయన నిలిచారు. ఈ ఏడాదికి గాను ప్రతిష్ట్మాత్మక ఫోర్బ్స్ 37 వ వార్షిక ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ఆయన 9 వ స్థానాన్ని దక్కించుకున్నారు. 83.4 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన వ్యక్తిగా నిలిచారు. గత ఏడాది 90.7 డాలర్ల ఆదాయంతో 10 వ స్థానంలో ఉన్న ఆయన ఈ సంవత్సరం ఓ మెట్టు పైకి ఎక్కారు.
ఆయన ఆదాయం గత ఆర్ధిక సంవత్సరం కంటే 7 శాతం పెరిగింది. గత ఏడాది అంబానీ నేతృత్వం లోని ఆయిల్ సంస్థ’ బెహె మూత్ రిలయన్స్ ఇండస్ట్రీస్ .. 100 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయాన్ని సాధించి ఇండియాలోనే ఈ ఘనత సాధించిన తొలి భారతీయ కంపెనీ కావడం విశేషం.
తాజా లిస్ట్ లో మైక్రోసాఫ్ట్ కి చెందిన స్టీవ్ బాల్మర్, గూగుల్ కి చెందిన లారీ పేజ్, సెర్గీ బ్రిన్, ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్, డెల్ టెక్నాలజీస్ కి చెందిన మైఖేల్ డెల్ కన్నా అంబానీ పై స్థాయిలో ఉన్నారు. ఇక హిండెన్ బెర్గ్ నివేదికతో మరో పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ ఈ సారి 24 వ స్థానానికి దిగజారారు.