»Modi Must Lose Former Pakistan Minister Fawad Chaudharys Comment
Fawad Chaudhary: మోదీ ఓడిపోవాలి.. పాక్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి వ్యాఖ్య
ఈ ఎన్నికల్లో భారత ప్రధాని మోడీ ఓడిపోవాలని పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి వ్యాఖ్యానించారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో మోడీని ఓడించే వారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
Modi must lose.. Former Pakistan Minister Fawad Chaudhary's comment
Fawad Chaudhary: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఓడిపోవాలంటూ పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి మరోసారి వ్యాఖ్యానించారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన అక్కసు వెళ్లగక్కారు. దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికీ 6 విడతల ఎన్నికలు ముగిశాయి. ఇక జూన్ 1న చివరి విడత పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఫవాద్ చౌదరి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాని మోడీ ఓడిపోవాలని, ఆయనతో పాటు ఆయన భావజాలం కూడా ఓడిపోవాలంటూ తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను ఓడించేది రాహుల్ గాంధీ కావొచ్చు ఆయన కూటమి కావొచ్కు అని, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గతంలో కూడా ఫవాద్ చౌదరీ రాహుల్ గాంధీకి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లకు అనుకూలంగా మాట్లాడారు. దీనిపై మంగళవారం స్పందించారు. ఓ మీడియాతో మాట్లాడుతూజ.. దాయాది దేశం నుంచి మన దేశంలోని రాజకీయ నేతలకు మద్దతు వస్తుందంటే ఇది ఆందోళనకరమని, దీనిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని మోడీ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన తరువాతి రోజే ఫవాద్ చౌదరి మరోసారి రాహుల్, కేజ్రీవాల్, మమతా బెనర్జీలకు శుభాకాంక్షలు చెప్పారు. దీంతో బిజేపీ శ్రేణులు ఇండియా కూటమిపై పలు ఆరోపణలు చేస్తున్నారు.
IANS Exclusive
"…The benefit of the Indian voter lies in having a good relationship with Pakistan. India should move ahead as a progressive country, and that is why Narendra Modi and his extreme ideology need to be defeated. Whoever defeats him, whether it's Rahul Ji, Kejriwal… pic.twitter.com/94HI0xUTTH