»Michaung Cyclone Michaung Effect Traffic Disruption In Chennai
Michaung Cyclone: ఎఫెక్ట్..కాలనీల్లోకి నీరు కోట్టుకుపోతున్న కార్లు!
మిచౌంగ్ తుపాన్ ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రరాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వస్తున్న వరదల కారణంగా రహదారులు ఎక్కడిక్కడ స్తంభించిపోయాయి. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.
Michaung Cyclone: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మిచౌంగ్ తుపాన్‌గా మారి తీవ్ర రూపం దాల్చుతుంది. ఈ తుపాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పెద్ద ఎత్తున కురుస్తున్న వర్షంతో భారీగా వరదలు వస్తున్నాయి. ఈ క్రమంలో రాకపోకలకు వీలులేకుండా ఎక్కడిక్కడే రహదారులన్నీ స్తంభించిపోయాయి. బస్స్టాండ్లు, విమానాశ్రయం, వీధులు అన్ని స్తంభించిపోయాయి. ఈ క్రమంలో చెన్నై నగరంలోని 14 రైల్వే సబ్‌వేల్లోకి నీరు చేరడంతో వాటిని కూడా మూసేశారు. మరో 24 గంటలు పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. చైన్నైలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నీటిలో చిక్కుకున్న వాహనాలు సహా పలువురిని కాపాడారు.
భారీ వర్షాల కారణంగా పాఠశాలలు మూసివేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు కూడా జారీ చేశారు. చెన్నైలోని చెంగల్పట్టు, కాంచీపురం, నాగపట్నం, కడలూరు, తిరువళ్లూరు జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. ఇప్పటికే చాలా ప్రాంత్రాలు నీట మునిగాయి. కేవలం పాఠశాలలకు మాత్రమే కాకుండా ప్రభుత్వ కార్యాలయాలకు కూడా తమిళనాడు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. చాలా కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోంకి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇప్పటికే భద్రతా చర్యలు చేపట్టారు. వరదల్లో ఉన్నవాళ్లకి సహాయం చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే 5000 సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసింది.