»Master Plan Ready For Next Year Isro Will Undertake 10 Key Experiments
ISRO: వచ్చే ఏడాదికి మాస్టర్ ప్లాన్ రెడీ..10 కీలక ప్రయోగాలు చేపట్టనున్న ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2024వ ఏడాదిలో 10 ప్రయోగాలు చేపట్టనున్నట్లు కేంద్రం వెల్లడించింది. అంతరిక్షంలో వ్యోమగాములను కూడా పంపేందుకు ప్రతిష్టాత్మక మిషన్‌ను సిద్దం చేస్తున్నట్లు తెలిపింది.
ఈ ఏడాదిలో ఇస్రో (ISRO) ప్రతిష్టాత్మకమైన ప్రయోగాలను చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో విజయవంతమైన ప్రయోగాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (Indian Space Research Organisation ) చేపట్టి ప్రపంచ వ్యాప్తంచ రికార్డుల (World Records)ను నమోదు చేసింది. చంద్రయాన్3 (Chandrayan3)తో చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపిన తొలి దేశంగా రికార్డు నెలకొల్పింది. ఆ ప్రయోగం తర్వాత సూర్యుడిపై ప్రయోగానికి ఆదిత్య ఎల్1 (Aditya L1)ను ప్రయోగించింది.
వరుస విజయాలతో మరింత జోష్‌లో ఉన్న ఇస్రో (ISRO) వచ్చే ఏడాదికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకుంది. 2024 ఏడాదిలో కీలక ప్రయోగాలను చేపట్టనుంది. మొత్తం 10 ప్రయోగాలు చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో స్పష్టం చేసింది. 6 పీఎస్ఎల్వీ ప్రయోగాలతో పాటుగా 3 జీఎస్ఎల్వీ, ఒక లాంచ్ వెహికల్ మార్క్-3 మిషన్ ఉన్నట్లు రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది.
భారత అంతరిక్ష సంస్త అభివృద్ధి చేసిన సరికొత్త ప్రయోగ వాహక నౌక అయిన ఎస్ఎస్ఎల్వీ (స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్) ద్వారా ప్రయోగాత్మకంగా ఓ శాటిలైట్‌ను నింగిలోకి పంపించేందుకు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభలో తెలిపారు. అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపేందుకు ‘గగన్‌యాన్’ పేరుతో భారత్ మరో ప్రతిష్టాత్మకమైన మిషన్‌ను చేపట్టనున్నట్లు ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.