భారతదేశంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రజలను సైబర్ మోసాల (Cyber fraud)పై చైతన్యం తీసుకురావడానికి ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేస్తున్నా, పోలీసులు (Police) ఎంత పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహిస్తున్నా సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో సైబర్ మోసాలకు తెగ పడుతూనే ఉన్నారు.ఆన్లైన్ రెంటల్ పేరుతో బెంగళూర్(Bangalore)కు చెందిన టెకీని నేరగాళ్లు రూ.60,000కు మోసగించారు.పోలీసులు ప్రజలకు ఎంత అప్రమత్తం చేసి సెబర్ నేరగాళ్లు చెలరేగుతున్నారు.నగరంలో వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో కిరాయి ఇంటి కోసం బాధితురాలు పలు ప్రముఖ రెంటల్ (Rental) వెబ్సైట్లలో సెర్చి చేశారు. ఈ క్రమంలో ఆమెను ఇంటి యజమానిగా సంప్రదించిన నిందితుడు బురిడీ కొట్టించాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్(Software Engineer)గా పనిచేసే బాధితురాలు ఐపీబీ ఇంటర్నేషనల్ టెక్ పార్క్‌లో నివసిస్తూ అద్దె కోసం న్యూ ఫ్లాట్‌లోకి మారాలని యోచిస్తోంది.
ఈనెల 17న ఓ ఇల్లు నచ్చడంతో ఆ పోస్ట్‌లో ఇచ్చిన ఫోన్ నెంబర్‌ను సంప్రదించింది. ప్రీతం (Pritham) అనే వ్యక్తి ఆమె కాల్‌ను రిసీవ్ చేసుకుని తాను ఫ్లాట్ (Flat) యజమానినని నమ్మబలికాడు. ఆమెకు ఇల్లు రెంట్‌కు ఇచ్చేందుకు తాను సిద్ధమని అంగీకరిస్తూ తన తరపున మేనేజర్ అనుపమ్ సింగ్ సంప్రదిస్తాడని తెలిపాడు. ఆపై సింగ్ బాధితురాలికి ఫోన్ చేసి డిపాజిట్(Deposit), రెంటల్ అగ్రిమెంట్ పేరుతో డబ్బును పంపాలని కోరాడు. కాల్ సరైనదేనని భావించిన బాధితురాలు అతడు అడిగిన డబ్బును ట్రాన్స్ఫర్ చేసింది. మరికొద్దిసేపటికి సింగ్ ఆమెకు కాల్ చేసి ఇంతకుముందు చేసిన పేమెంట్ (Payment) సాంకేతిక లోపం కారణంగా విఫలమైందని, మరోసారి డబ్బు పంపాలని కోరడంతో బాధితురాలు నిలదీయడంతో అతడు కాల్‌ను డిస్కనెక్ట్ (Disconnect) చేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.