Komati Reddy : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. కాగా... ఈ ఘటనను వ్యతిరేకిస్తూ భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆందళోన చేపట్టారు. యాదాద్రి జిల్లా బొమ్మలరామారంలో ఆయన ఈ ఆందోళన చేపట్టారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. కాగా… ఈ ఘటనను వ్యతిరేకిస్తూ భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆందళోన చేపట్టారు. యాదాద్రి జిల్లా బొమ్మలరామారంలో ఆయన ఈ ఆందోళన చేపట్టారు. ప్రధాని మోదీ దిష్టి బొమ్మను సైతం దహనం చేశారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ఎంపీగా అనర్హత వేటు వేయడం దుర్మార్గమని మండిపడ్డారు. మార్చి 23న ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని పేర్కొన్నారు. రాహుల్ వెంట తామంతా ఉంటామని.. అవసరమైతే పదవులకు రాజీనామా కూడా చేస్తామని స్పష్టం చేశారు.
భారత్ జోడో యాత్రలో కులమతాలకు అతీతంగా ప్రజలు పాల్గొన్నారని.. ఈ పాదయాత్రలో రాహుల్ గాంధీ ఎక్కడ రాజకీయాల గురించి మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో రాహుల్ ఒక మాట అంటే దానిమీద కోర్టు తీర్పు ఇచ్చిందని.. నెల రోజుల సమయం ఇచ్చి వెంటనే స్పీకర్ అనర్హత వేటు వేయడం సరికాదన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.