»Karnataka Government Employees On Strike From March 1
Strike : మార్చి 1 నుంచి కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె
రాష్ట్ర బడ్జెట్లో తమ జీతాల పెంపునకు నిధులు కేటాయించకపోవడంతో మార్చి 1 నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్లు కర్ణాటక (Karnataka) ప్రభుత్వ ఉద్యోగులు ప్రకటించారు. ప్రభుత్వం ఏడో వేతన (Seventh wage) సంఘం సిఫార్సులు అమలు చేస్తుందని ఉద్యోగులు పెట్టుకున్న ఆశలపై సీఎం బొమ్మై (CM Bommai) నీళ్లు చల్లారు. దీంతో వారు సమ్మె బాట పట్టనున్నారు. వారం లోగా శాసన సభలో జీతాల పెంపునకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేస్తే తప్ప సమ్మె ఆలోచన విరమించుకొనే ప్రసక్తే లేదని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తేల్చి చెప్పింది.
రాష్ట్ర బడ్జెట్లో తమ జీతాల పెంపునకు నిధులు కేటాయించకపోవడంతో మార్చి 1 నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్లు కర్ణాటక (Karnataka) ప్రభుత్వ ఉద్యోగులు ప్రకటించారు. ప్రభుత్వం ఏడో వేతన (Seventh wage) సంఘం సిఫార్సులు అమలు చేస్తుందని ఉద్యోగులు పెట్టుకున్న ఆశలపై సీఎం బొమ్మై (CM Bommai) నీళ్లు చల్లారు. దీంతో వారు సమ్మె బాట పట్టనున్నారు. వారం లోగా శాసన సభలో జీతాల పెంపునకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేస్తే తప్ప సమ్మె ఆలోచన విరమించుకొనే ప్రసక్తే లేదని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తేల్చి చెప్పింది. ఉద్యోగుల డిమాండ్‌పై సీఎం కార్యాలయ అధికారి ఒకరు స్పందిస్తూ ముఖ్యమంత్రి సమాధానం కోసం వేచి చూడాలని విజ్ఞప్తి చేశారు. వేతన సంఘం సిఫార్సుల అమలుతో పాటు పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని, కనీసం 40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఏడో వేతన కమిషన్ సిఫారసుల అమలుతో పాటు పాతపెన్షన్ స్కీమ్‌ను అమలు చేయాలనే డిమాండ్‌తో మార్చి 1వ(March1) తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె(Government employees strike)కు సిద్ధమయ్యారు.
ఇదే విషయమై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు షడాక్షరి మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులంతా మూకుమ్మడిగా ఆందోళనలో పాల్గొంటారన్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి గడువు ఇచ్చామని, సమస్య పరిష్కారం కానందునే నిరసనల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. వేతనాల పెంపునకు సంబంధించి ప్రభుత్వం నోటి మాటలతోనే జాప్యం చేస్తోందన్నారు. వేతనాల విషయంలో స్పష్టమైన ఆదేశాలు లేవన్నారు. ఇందుకోసం ఏడెనిమిది నెలలుగా వేచి చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్లో ప్రకటిస్తారని ఆశించామని, కానీ అటువంటి ప్రస్తావనే లేకుండా చేశారన్నారు. పాతపెన్షన్( old pension) విధానం అమలు చేయాల్సిందేనని పట్టుబట్టారు.పెన్షన్‌లోనూ ఎటువంటి స్పష్టత ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సేవలను పూర్తిగా స్తంభింపచేస్తామన్నారు. ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు మినహాయించి మిగిలిన సేవలు నిలిచిపోనున్నట్లు తెలిపారు. విద్యాసంస్థలు మూతపడతాయని, కళాశాలలకు ప్రభావం ఉంటుందని తద్వారా పరీక్షలు రద్దవుతాయన్నారు. రెవెన్యూ, విధానసౌధలోని అన్ని కార్యాలయాల ఉద్యోగులు (employees) బంద్‌లో పాల్గొంటారని షడాక్షరి తెలిపారు. నిరసనల పేరుతో వేలాది మంది చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసేది లేదని, సర్కిళ్ల వారిగా రోడ్డెక్కేది లేదన్నారు కానీ వినూత్నంగా ఉద్యోగులు వారి ఇళ్లలోనే ఉంటూ నిరసన తెలుపుతారన్నారు.