»Indigo Flight Crew Special Announcement For Isro Chariman
Isro Charimanకు ఇండిగో సిబ్బంది అపూర్వ స్వాగతం
చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అయ్యింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఎక్కడికి వెళ్లినా సరే అక్కడి ప్రజలు అపూర్వంగా స్వాగతం చెబుతున్నారు. ఇండిగో విమానంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రయాణించగా.. ఆయనకు సిబ్బంది ప్రత్యేక అనౌన్స్ మెంట్ చేసి గౌరవించాయి.
Indigo Flight Crew Special Announcement For Isro Chariman
Isro Chariman: చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అయ్యింది. యావత్ జాతి గర్వంతో ఉప్పొంగి పోతుంది. శాస్త్రవేత్తలపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇస్రో చైర్మన్ (Isro Chariman) సోమనాథ్ (somnath) ఇండిగో విమానం ఎక్కిన వీడియోను సిబ్బంది సోషల్ మీడియాలో షేర్ చేశారు. గురువారం రోజున సోమనాథ్ (somnath) ట్రావెల్ చేయగా.. టేకాఫ్‌కు ముందు ఆయనను గౌరవిస్తూ సిబ్బంది ప్రత్యేక అనౌన్స్ మెంట్ చేశారు.
ఈ రోజు మనతో ప్రత్యేక వ్యక్తి ఉన్నారు. మీరు మాతో ఉన్నందుకు సంతోషంగా ఉంది. మీకు సేవలు అందించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాం. దేశం గర్వపడేలా చేసినందుకు ధన్యవాదాలు అని చెప్పగా.. ప్రయాణికులు చప్పట్లతో అపూర్వ స్వాగతం పలికారు. తర్వాత ఎయిర్ హోస్టెస్ ఫుడ్ ట్రేతోపాటు గ్రీటింగ్ కార్డ్ అందజేశారు. చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్ అడుగిడింది. అక్కడి పరిస్థితులను ఫోటోలు తీసి పంపిస్తోంది. వీడియో కూడా షేర్ చేసింది. అక్కడ మానవ జాతి నివాసానికి అనుకూలంగా ఉందా..? లేదా అనే అంశాలపై అధ్యయనం చేస్తారు.