»Https Www V6velugu Com Janardhana Reddy Leading In Karnataka From Gangawathy Constituency
గాలి జనార్ధన్ రెడ్డి బ్యాచ్ కు ఎదురుదెబ్బ
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో గాలి జనార్ధన్ రెడ్డి బ్యాచ్ కు ఎదురుదెబ్బ తగులుతోంది. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ పేరుతో ఎన్నికల బరిలో నిలిచిన ఆ పార్టీ గంగావతిలో తప్ప ఎక్కడా ప్రభావాన్ని చూపించడం లేదు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో గాలి జనార్ధన్ రెడ్డి బ్యాచ్ కు ఎదురుదెబ్బ తగులుతోంది. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ పేరుతో ఎన్నికల బరిలో నిలిచిన ఆ పార్టీ గంగావతిలో తప్ప ఎక్కడా ప్రభావాన్ని చూపించడం లేదు. గాలి జనార్థన్ రెడ్డితో పాటుగా 15 మంది అభ్యర్థులు ఈ ఏడాది ఎన్నికల్లో పోటీ చేశారు.
గంగావతి అసెంబ్లీ స్థానం నుండి గాలి జనార్ధన్ రెడ్డి పోటీ చేయగా, బళ్లారి నుంచి ఆయన భార్య అరుణ బరిలో నిలిచారు. గాలి జనార్థన్ రెడ్డి ఆధిక్యంలో ఉండగా, ఆయన భార్యతో పాటుగా మిగతా అభ్యర్థులందరూ వెనకంజలోనే ఉన్నారు.
15 స్థానాల్లో పోటీ చేసిన కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ అన్ని స్థానాల్లోనూ బీజేపీ ఓట్లు చీల్చి కాంగ్రెస్ కు లాభం చేకూర్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక్క గంగావతిలో తప్ప.. మిగతా 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీనే ఆధిక్యంలో ఉంది.