»Haldwani Violence 300 Muslim Families Flee Manhunt Intensified To Arrest Rioters
Haldwani Violence: హల్ద్వానీలో వలస బాట పట్టిన 300 ముస్లిం కుటుంబాలు.. వెతుకులాటలో పోలీసులు
తాజాగా ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. హింసాకాండలో ఆరుగురు మరణించగా, 60 మంది గాయపడ్డారు. హింస జరిగిన నాలుగు రోజుల తర్వాత.. 300 కంటే ఎక్కువ ముస్లిం కుటుంబాలు బంబుల్‌పురా ప్రాంతం నుండి పారిపోయాయి.
Haldwani Violence: తాజాగా ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. హింసాకాండలో ఆరుగురు మరణించగా, 60 మంది గాయపడ్డారు. హింస జరిగిన నాలుగు రోజుల తర్వాత.. 300 కంటే ఎక్కువ ముస్లిం కుటుంబాలు బంబుల్‌పురా ప్రాంతం నుండి పారిపోయాయి. హింసాకాండ అనంతరం ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. కర్ఫ్యూ కారణంగా ఇక్కడ వాహనాలు నడవడం లేదు. దీంతో అనేక కుటుంబాలు తమ సామాన్లతో వీధిన పడ్డట్లు కనిపించాయి. ఫిబ్రవరి 8న బంబుల్‌పురాలో ఆక్రమణల నిరోధక ఆపరేషన్ సందర్భంగా ‘అక్రమ’ మసీదు, మదర్సాను కూల్చివేసిన ప్రాంతంలో ఆంక్షలు విధించబడ్డాయి.
ఈ ప్రాంతం నుంచి అనేక ముస్లిం కుటుంబాలు వలస వస్తున్నాయని ఇండియా టుడే రాసింది. ఇప్పటి వరకు 300 కుటుంబాలు వలస వెళ్లాయి. హింసాకాండ దృష్ట్యా పోలీసులు ఇక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు. హింసాకాండకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు 30 మందిని అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితుల వద్ద నుంచి ఆయుధాలను కూడా ఉత్తరాఖండ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హల్ద్వానీ పరిధిలోకి వచ్చే నైనిటాల్ జిల్లా యంత్రాంగం ఇప్పుడు హల్ద్వానీలోని అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూను సడలించింది. అయితే బంభుల్‌పురా ప్రాంతంలో కర్ఫ్యూ ఇప్పటికీ అమలులో ఉంది.
ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కర్ఫ్యూ కొనసాగుతున్న ప్రాంతాలు మినహా హల్ద్వానీలోని అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించబడ్డాయి. అనేక ముస్లిం కుటుంబాలు ఇక్కడి నుండి వలస వెళ్లాలని యోచిస్తున్నాయి. అయితే జిల్లా యంత్రాంగం ఇప్పుడు బంబుల్‌పురాలోని అన్ని వచ్చిపోయే పాయింట్లను మూసివేసింది. హింసాకాండలో పాల్గొన్న అల్లరిమూకలు కూడా పారిపోయే అవకాశం ఉందని పరిశోధకులు భావించినందున పోలీసులు ఆ ప్రాంతాన్ని మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారని వర్గాలు తెలిపాయి.
ఆదివారం జమియత్ ఉలేమా-ఏ-హింద్ ప్రతినిధి బృందం హల్ద్వానీని సందర్శించి సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM)తో సమావేశం నిర్వహించింది. దీనిలో వారు తమ డిమాండ్ల గురించి జిల్లా యంత్రాంగానికి తెలియజేశారు. దాదాపు గంటకు పైగా సమావేశం కొనసాగింది. ఎస్డీఎం ని కలిసిన తర్వాత జమియత్ ఉలేమా-ఎ-హింద్ మాట్లాడుతూ.. పరిపాలన ఆతురుతలో మసీదును కూల్చివేయడానికి నిర్ణయం తీసుకుందని, ఇది ఆ ప్రాంతంలో ఉద్రిక్తత, హింసకు దారితీసిందని ఆరోపించింది.